'గ్రామాలలో మౌలిక వసతుల కల్పనకు అధిక నిధులు'

దిశ, రామన్నపేట: గ్రామాల అభివృద్ధికి తెరాస ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు. ఆదివారం మండలంలోని కుంకుడు పాముల, బి తుర్కపల్లి, బాచుపల్లి, ఎన్నారం గ్రామాలలో పల్లె ప్రకృతి వనం వైకుంఠ ధామాలు, డంపింగ్ యార్డులు ప్రారంభించి రూ. 20 లక్షలతో నిర్మించనున్న సీసీ రోడ్లకు శంకుస్థాపన చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. గ్రామాలలో మౌలిక వసతుల కల్పనకు అధిక నిధులు వెచ్చిస్తున్నట్లు పేర్కొన్నారు. గ్రామాల అభివృద్ధి ధ్యేయంగా […]

Update: 2021-12-26 05:40 GMT

దిశ, రామన్నపేట: గ్రామాల అభివృద్ధికి తెరాస ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు. ఆదివారం మండలంలోని కుంకుడు పాముల, బి తుర్కపల్లి, బాచుపల్లి, ఎన్నారం గ్రామాలలో పల్లె ప్రకృతి వనం వైకుంఠ ధామాలు, డంపింగ్ యార్డులు ప్రారంభించి రూ. 20 లక్షలతో నిర్మించనున్న సీసీ రోడ్లకు శంకుస్థాపన చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. గ్రామాలలో మౌలిక వసతుల కల్పనకు అధిక నిధులు వెచ్చిస్తున్నట్లు పేర్కొన్నారు. గ్రామాల అభివృద్ధి ధ్యేయంగా గ్రామస్తులు ఏకతాటిపైకి రావాలని సూచించారు. కులమతాలకు తావులేకుండా అభివృద్ధి సంక్షేమ ఫలాలు ప్రతిఒక్కరికీ చేరవేస్తామని అని ఆయన తెలిపారు. కుంకుడు పాముల గ్రామాభివృద్ధి తన బాధ్యతన్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల లోపు 90% సీసీ రోడ్లు,డ్రైనేజీ నిర్మాణం చేపడతామని అన్నారు.

ఎస్సీ, బీసీ కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి కృషి చేస్తానని అన్నారు. ఎన్నారం గ్రామంలో ప్రాథమిక పాఠశాలలో అదనపు తరగతి గది నిర్మాణం, హైస్కూల్ ప్రహరీ గోడ నిర్మాణం తోపాటు గ్రామంలో పీర్ల కొట్టం నిర్మాణానికి, ఆంజనేయస్వామి దేవాలయ నిర్మాణానికి నిధులు ఇస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమాల్లో ఎంపీపీ కన్నెబోయిన జ్యోతి, జెడ్పిటిసి పూన్న లక్ష్మి, సర్పంచులు బొక్క యాదిరెడ్డి, బొక్క కృష్ణవేణి, మెట్టు మహేందర్ రెడ్డి, ఎంపీటీసీలు దోమల సతీష్, ఏనుగు పుష్పమ్మ, టిఆర్ఎస్ మండల అధ్యక్ష, కార్యదర్శులు మందడి ఉదయ్ రెడ్డి, పోష బోయిన మల్లేశం నాయకులు గుత్తా నర్సిరెడ్డి, మెట్టు శ్రీనివాస్ రెడ్డి, బొక్క మాధవ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

Tags:    

Similar News