అప్రమత్తంగా ఉండండి.. లేకపోతే ప్రాణాలకే ప్రమాదం
దిశ, వనపర్తి: కరోనా మహమ్మారిని కట్టడి చేయడంలో ప్రజలు ప్రభుత్వ సూచనలు తప్పనిసరిగా పాటించాలని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి కోరారు. కరోనా సెకండ్ వేవ్ విషయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, లేకుంటే ప్రాణాలకే ప్రమాదం ఉందని సూచించారు. కరోనా తగ్గుముఖం పట్టేవరకు ప్రజలు ప్రభుత్వ సూచనలు, స్వీయ నియంత్రణ పాటించాలన్నారు. ప్రజలు కోవిడ్ లక్షణాలు కనిపించిన వెంటనే వైద్యులను సంప్రదించి, వారి సూచన మేరకు మందులు వాడడం ప్రారంభించాలన్నారు. వనపర్తి జిల్లా ప్రభుత్వ […]
దిశ, వనపర్తి: కరోనా మహమ్మారిని కట్టడి చేయడంలో ప్రజలు ప్రభుత్వ సూచనలు తప్పనిసరిగా పాటించాలని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి కోరారు. కరోనా సెకండ్ వేవ్ విషయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, లేకుంటే ప్రాణాలకే ప్రమాదం ఉందని సూచించారు. కరోనా తగ్గుముఖం పట్టేవరకు ప్రజలు ప్రభుత్వ సూచనలు, స్వీయ నియంత్రణ పాటించాలన్నారు. ప్రజలు కోవిడ్ లక్షణాలు కనిపించిన వెంటనే వైద్యులను సంప్రదించి, వారి సూచన మేరకు మందులు వాడడం ప్రారంభించాలన్నారు.
వనపర్తి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి నూతనంగా ఐదు వెంటిలేటర్లు మంజూరయ్యాయని మంత్రి తెలిపారు. వీటిని త్వరితగతిన సిద్దం చేసుకోవాలని, అవసరమైన సిబ్బందిని తాత్కాలిక ప్రాతిపదికన నియమించుకోవాలని జిల్లా ఆస్పత్రి అధికారులను మంత్రి ఆదేశించారు. జిల్లా ప్రజలకు అవసరానికి సరిపడ రెమిడెసివర్లు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. ప్రైవేటు ల్యాబ్ లు ప్రజల వద్ద పరీక్షలకు అధిక బిల్లులు వసూలు చేయకూడదన్నారు. ప్రైవేటు ఆసుపత్రులు, వైద్యులు తప్పనిసరి పరిస్థితులలో అవసరమైతేనే సీటీ స్కాన్ కు సిఫారసు చేయాలని సూచించారు.ప్రజలు అనవసరంగా ఆందోళనకు గురై సీటీ స్కాన్ తీయించుకుని రోగాలను కొనితెచ్చుకోవొద్దని సూచించారు.