వామ్మో ఎంత పెద్ద చేపనో..
జోగులాంబ గద్వాల జిల్లా అయిజ మండలం భూంపురం గ్రామ సమీపంలోని నెట్టెంపాడు కాలువలో పెద్ద కొర్రమీను చేప రైతు బోయ హనుమంతుకు లభించింది.
దిశ, అలంపూర్ : జోగులాంబ గద్వాల జిల్లా అయిజ మండలం భూంపురం గ్రామ సమీపంలోని నెట్టెంపాడు కాలువలో పెద్ద కొర్రమీను చేప రైతు బోయ హనుమంతుకు లభించింది. దీని బరువు దాదాపు 10 కేజీలు ఉంటుందని, సుమారు ఆరు అడుగులు ఉందని రైతు తెలిపాడు. నెట్టెంపాడు సాగునీటి కాల్వలో నీటిని నిలుపుదల చేయడంతో చేప కిందికి కొట్టుకొని రావడంతో లభించిందని తెలిపాడు. ఈ మధ్యకాలంలో ఇలాంటి పెద్ద చేప దొరకడం మొదటిసారి అని రైతు తెలిపారు.