ఉచిత కంప్యూటర్ శిక్షణకు దరఖాస్తుల ఆహ్వానం..

రత్నగిరి ఫౌండేషన్ ఆధ్వర్యంలో స్వామి రామనందా తీర్థ రూరల్ ఇన్స్టిట్యూట్ సహకారంతో కొల్లాపూర్ లో నిర్వహించనున్న ఉచిత కంప్యూటర్ శిక్షణ ఇవ్వనున్నారు.

Update: 2024-12-23 08:42 GMT

దిశ, కొల్లాపూర్ : రత్నగిరి ఫౌండేషన్ ఆధ్వర్యంలో స్వామి రామనందా తీర్థ రూరల్ ఇన్స్టిట్యూట్ సహకారంతో కొల్లాపూర్ లో నిర్వహించనున్న ఉచిత కంప్యూటర్ శిక్షణ ఇవ్వనున్నారు. ఆసక్తి గల అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు రత్నగిరి ఫౌండేషన్ కన్వీనర్ కేతూరి ధర్మతేజ, కంప్యూటర్ శిక్షకుడు భీమయ్య సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు.

ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఎమ్మెస్ ఆఫీస్, డీటీపీ కాలవ్యవధి రెండు నెలలని, ఈ కోర్స్ కు ఈ నెల 24 వ తేదీ నుంచి దరఖాస్తు స్వీకరించనున్నారని, చివరి తేదీ 31 వరకు దరఖాస్తులను స్వీకరించనున్నట్లు వారు పేర్కొన్నారు. క్లాసులు ప్రారంభం జనవరి 2వ తేదీ నుంచి కొనసాగుతాయని కన్వీనర్ ధర్మ తేజ, కంప్యూటర్ శిక్షకుడు భీమయ్య పేర్కొన్నారు. కంప్యూటర్ పట్ల ఆసక్తి ఉన్నవారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని వారు కోరారు.


Similar News