ప్రజా పాలనలో రైతులకు అధిక ప్రాముఖ్యత : నాగర్ కర్నూలు ఎమ్మెల్యే
కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్రంలో కొనసాగుతున్న ప్రజా
దిశ,బిజినేపల్లి : కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్రంలో కొనసాగుతున్న ప్రజా పాలనలో విద్యా వైద్యంతో పాటు వ్యవసాయ రంగానికి అధిక ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుందని నాగర్ కర్నూలు ఎమ్మెల్యే డాక్టర్ రాజేష్ రెడ్డి అన్నారు. సోమవారం బిజినపల్లి మండలం లో టెంపుల్ కు సంబంధించిన సీసీ రోడ్డును నాగర్ కర్నూలు ఎమ్మెల్యే ప్రారంభించి మాట్లాడుతూ దాదాపు ప్రత్యేక అభివృద్ధి నిధుల నుంచి ఐదు లక్షల వ్యయంతో కేత్రబండ తండాలో గుట్టపై కొలువైన ఆంజనేయ స్వామి టెంపుల్ కు సీసీ రోడ్డును ప్రారంభించారు. అనంతరం మండల కేంద్రంలో ప్రజా పాలన విజయోత్సవాలలో భాగంగా రైతులకు సింకర్లు పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ జాతీయ రైతు దినోత్సవ సందర్భంగా రైతులకు శుభాకాంక్షలు తెలిపారు. ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి బాధ్యతలు చేపట్టిన తర్వాత రాష్ట్రంలో 31 వేల కోట్లు రైతుల రుణాలను మాఫీ చేయడం జరిగిందని బిజినపల్లి మండలం లో నాలుగు విడుదలలో 7329 మంది లబ్ధిదారులకు రూపాయలు 59 కోట్ల రుణాలను మాఫీ చేయడం జరిగిందని తెలిపారు. త్వరలో రైతుబంధును కూడా రైతులకు అందించడం జరుగుతుందని రైతుబంధు చిన్న సన్నకారు రైతులకు అందేలా ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకోవడం జరుగుతుందని వివరించారు.
గత ప్రభుత్వం రైతుబంధు పేరుతో ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తూ రాళ్లు గుట్టలకు కూడా 21 కోట్ల రూపాయలను రైతుబంధు పేరా ఇచ్చి ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసిన ఘనత గత ప్రభుత్వానిదని, ప్రస్తుతం అలా లేకుండా వ్యవసాయ శాఖ మంత్రి ప్రత్యేక నిబంధనలు రూపొందించడం జరిగిందని సాగు చేసే ప్రతి రైతుకు లబ్ధి చేకూర్చే విధంగా కాంగ్రెస్ ప్రభుత్వ పథకాలు ఉంటాయని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉధ్యాన శాఖ అధికారి జగన్, తహసీల్దార్ శ్రీరాములు, కాంగ్రెస్ నాయకులు కాంగ్రెస్ మండల అధ్యక్షులు మిద్దె రాములు ,అమృత్ రెడ్డి, వెంకట్ స్వామి ,హరీష్ రెడ్డి, రాజ వర్ధన్ రెడ్డి, రామచందర్, రామ్ చందర్ నాయక్, గంగనమోని తిరుపతయ్య ,నసీర్, గోవింద నాయక్, వాల్య నాయక్, రాగి మధుసూదన్ రెడ్డి, గుడ్ల నర్వ బాలస్వామి పాల్గొన్నారు.