సాగుకు నీళ్లు లేవు అనడం ప్రభుత్వ అసమర్థత పాలన : మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి

రైతులకు సాగునీరు అందించలేని దుస్థితిలో రేవంత్ ప్రభుత్వం ఉంది

Update: 2024-12-23 13:51 GMT

దిశ, వనపర్తి టౌన్ : రైతులకు సాగునీరు అందించలేని దుస్థితిలో రేవంత్ ప్రభుత్వం ఉంది అంటే ప్రభుత్వ అసమర్థత పాలన అందిస్తుందని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ఆరోపించారు. సోమవారం తన నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశమైన మాట్లాడుతూ... ఉమ్మడి పాలమూరు జిల్లాలోని సాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేసి లక్ష ఎకరాలకు సాగునీరు అందించిన ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వం దాన్ని గుర్తు చేశారు. 90% పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు పూర్తి చేశామని 10% పనులు పూర్తి చేయలేని రేవంత్ సర్కార్ అని ఆయన ఎద్దేవా చేశారు. సాధు నీరు కోసం రైతు రుణమాఫీ కోసం రైతు భరోసా కోసం రైతులు పడుతున్న కష్టాలు కళ్లకు కట్టినట్లు అందరు కనిపిస్తున్నాయని ఆయన పేర్కొన్నారు. యాసంగి సీజన్లో ఉమ్మడి పాలమూరు ప్రాజెక్టు ద్వారా సాగునీరు ఇలా ఇవ్వాలన్నదే నీటిపారుదల శాఖ మంత్రి బాధ్యత ఉందన్నారు కనీసం ఎంత స్టోరేజ్ ఉందని, రైతులకు ఎంత సరిపడుతుందని రైతుల ముందే తెలపాలన్నారు.

రికార్డు స్థాయిలో వర్షాలు పడ్డాయి 35 రోజుల పాటు ఎడతెరిపి లేని వర్షాలు పడి దాదాపుగా 2530 టీఎంసీల నీళ్లు సముద్రం పాలవుతుందని గుర్తు చేశారు. పక్క నియోజకవర్గంలో ఫోటోలు పెట్టుకుని సంబరాలు తప్ప జూపల్లికి ప్రజలకు మంచి ఆలోచన చేయాలన్న సంకల్పం లేదని అన్నారు. నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాటలు ఉట్టి మాటలేనని అన్నారు. 2016 లో అప్పటి నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావు వచ్చినప్పుడు అప్పటి మంత్రి జూపల్లి మాట్లాడిన వీడియోను మీడియా ముందు చూపించారు. గత ప్రభుత్వాలయంలో పాలమూరు పంటలకు నీళ్లు అందించకపోవడం వల్లే పంటలు పండుగ ప్రజలు నానా ఇబ్బందులు పడ్డారన్నారు. ఈ సమావేశంలో బీఆర్ఎస్ నాయకులు లక్ష్మయ్య, కురుమూర్తి యాదవ్, కృష్ణ నాయక్, మున్సిపల్ చైర్మన్ కరుణశ్రీ, రాములు, విజయ్ పృథ్వి తదితరులు పాల్గొన్నారు.


Similar News