బయటకు వెళ్లి వస్తానని చెప్పి.. బాలుడు అదృశ్యం

బయటకు వెళ్లి వస్తానని చెప్పి ఓ బాలుడు అదృశ్యం అయిన

Update: 2024-12-23 15:50 GMT

దిశ, హన్వాడ : బయటకు వెళ్లి వస్తానని చెప్పి ఓ బాలుడు అదృశ్యం అయిన ఘటన హన్వాడ మండల పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఎస్సై వెంకటేష్ తెలిపిన వివరాల మేరకు బాయికాని నవీన్ కుమార్ (17 ) హన్వాడ జడ్పీహెచ్ ఎస్ లో పదవ తరగతి చదువుతున్నాడు. ఈ నెల 22న ఉదయం 5 : 30 గంటలకు తల్లిదండ్రులకు ఆరుబయటకు వెళ్ళొస్తానని వెళ్ళాడు. బయటకు వెళ్ళొస్తానన్న కొడుకు ఎంతసేపైనా రాకపోవడంతో ఆచూకీ కోసం వెతికిన కుటుంబ సభ్యులకు ఆచూకీ లభించకపోవడంతో సోమవారం హన్వాడ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. తండ్రి బాయికాని రాజు ఫిర్యాదు మేరకు మిస్సింగ్‌ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై వెంకటేష్ తెలిపారు.


Similar News