అప్పుల బాధతో వ్యక్తి ఆత్మహత్య

అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకొని వ్యక్తి మృతి చెందిన సంఘటన

Update: 2024-12-23 16:04 GMT

దిశ, గరిడేపల్లి : అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకొని వ్యక్తి మృతి చెందిన సంఘటన సోమవారం సూర్యాపేట జిల్లా గరిడేపల్లి మండల కేంద్రంలో చోటు చేసుకుంది. స్థానిక ఎస్ఐ చలి కంటి నరేష్ తెలిపిన వివరాల ప్రకారం నేరేడుచర్ల మండలం నరసయ్య గూడెం గ్రామానికి చెందిన నన్నెపంగ వెంకన్న గరిడేపల్లి లోని భారత్ పెట్రోల్ బంక్ లో ఆపరేటర్ గా పని చేస్తున్నాడు.అతను తన గ్రామంలో అప్పులు తెచ్చి ఇల్లు నిర్మించి అప్పులు తీర్చలేక జీవితంపై విరక్తి చెంది ఆదివారం రోజున డ్యూటీ కి వెళ్తున్న అని ఇంట్లో చెప్పి గరిడేపల్లి లో గల శివ నాగసాయి ఫిల్లింగ్ స్టేషన్ వద్ద గడ్డి మందు తాగి అపస్మారక స్థితిలో పడి ఉన్నాడు. ఇది గమనించి చుట్టుపక్కల వారు అంబులెన్స్ లో హుజూర్ నగర్ ప్రభుత్వ హాస్పిటల్ కు తరలించగా వారు మెరుగైన చికిత్స కోసం సూర్యాపేట ప్రభుత్వ హాస్పిటల్ కి తరలించగా చికిత్స పొందుతూ మరణించాడు.మృతిని భార్య కళమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై నరేష్ తెలిపారు. కాగా మృతునికి ఒక కుమారుడు,కుమార్తె గలరు.


Similar News