పాఠశాల ఆత్మీయ సమ్మేళనానికి వెళ్లి వస్తూ.. అనంతలోకాలకు..
నిజాంసాగర్ మండలంలోని జవహర్ నవోదయ విద్యాలయ 29 వ బ్యాచ్
దిశ,నిజాంసాగర్ : నిజాంసాగర్ మండలంలోని జవహర్ నవోదయ విద్యాలయ 29 వ బ్యాచ్ఇంటర్మీడియట్ పూర్వ విద్యార్థిని శివాని ఆదివారం రాత్రి హైదరాబాద్ లో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. విద్యార్థిని తల్లిదండ్రులు, నవోదయ విద్యాలయ ఉపాధ్యాయులు తెలిపిన వివరాల ప్రకారం నిజాంసాగర్ మండల కేంద్రం సమీపంలోని జవహర్ కేంద్రీయ నవోదయ విద్యాలయంలో ఆదివారం పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి దోమకొండ మండలానికి చెందిన శివాని నవోదయ పాఠశాలలో 29వ బ్యాచ్ పూర్వ విద్యార్థిని,కాగా శివాని ప్రస్తుతం హైదరాబాద్ లోని ఓ ప్రైవేటు కళాశాలలో బీటెక్ చదువుతుంది.
ఆదివారం పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనానికి హైదరాబాద్ నుంచి తన పూర్వ విద్యార్థుల మిత్రులతో కలిసి వచ్చి నిజాంసాగర్ నవోదయ పాఠశాలలో నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమంలో పాల్గొని మిత్రులతో కలిసి బస్సులో తిరిగి హైదరాబాద్ వెళ్లిన అనంతరం ఓ మిత్రుని ద్విచక్ర వాహనంపై వెళుతుండగా హైదరాబాదులోని నానక్ రామ్ గూడ ప్రాంతంలో ప్రమాదవశాత్తు కారు ఎదురుగా వచ్చి బలంగా ఢీ కొనడంతో రోడ్డు ప్రమాదంలో శివాని అక్కడికక్కడే మృతి చెందినట్లు తెలిపారు. తమ పాఠశాల పూర్వ విద్యార్థిని శివాని మృతి చెందిన విషయం తెలుసుకున్న పూర్వ విద్యార్థులతో పాటు నవోదయ విద్యార్థులు, ఉపాధ్యాయులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు.శివాని ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుని ప్రార్థిస్తున్నట్లు పేర్కొన్నారు.