పీవీ నరసింహారావు సేవలు చిరస్మరనీయం : వనపర్తి ఎమ్మెల్యే

భారత దేశ ఆర్థిక సంస్కరణల పితామహుడిగా పేరుగాంచిన భారతదే

Update: 2024-12-23 11:32 GMT

 దిశ,వనపర్తి : భారత దేశ ఆర్థిక సంస్కరణల పితామహుడిగా పేరుగాంచిన భారతదేశ మాజీ ప్రధానమంత్రి పీవీ నరసింహారావు సేవలు చిరస్మరణీయమని వనపర్తి నియోజకవర్గ ఎమ్మెల్యే మేఘా రెడ్డి అన్నారు.భారతదేశ మాజీ ప్రధానమంత్రి పీవీ నరసింహారావు 20వ జయంతి పురస్కరించుకొని సోమవారం వనపర్తి జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఎమ్మెల్యే తూడి మేఘా రెడ్డి రెడ్డి పీవీ నరసింహారావు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.

ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ భారత మాజీ ప్రధాని పీవీ నరసింహారావు తీసుకొచ్చిన ఆర్థిక సంస్కరణ ద్వారా భారత దేశ ఆర్థిక పరిస్థితి నూతన మలుపు తీసుకుందని కొనియాడారు. ఆయన చేసిన ఆర్థిక సంస్కరణలు భారతదేశ సంక్షోభ సితిని అధిగమించేలా చేసి దిక్సూచిగా మారాయని తెలిపారు.ఈ కార్యక్రమంలో వనపర్తి పట్టణ అధ్యక్షులు చీర్ల చందర్,వనపర్తి మున్సిపల్ చైర్మన్ మహేష్,మున్సిపల్ కౌన్సిలర్ లు,కాంగ్రెస్ పార్టీ నాయకులు ఈరాపోగు శ్రీనివాస్,కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు మండల నాయకులు తదితరులు పాల్గొన్నారు.


Similar News