గొర్రెల దొంగతనానికి వచ్చారు.. అడ్డంగా బుక్కయ్యారు..

మక్తల్ పరిధిలో గొర్రెల దొంగతనానికి వచ్చిన బలి చక్రపురం తండాకు చెందిన ఐదుగురు వ్యక్తులు గొర్రెల దొంగతనానికి వచ్చి ముగ్గురు పట్టుబడ్డారు.

Update: 2024-12-23 03:25 GMT

దిశ, మక్తల్ : మక్తల్ పరిధిలో గొర్రెల దొంగతనానికి వచ్చిన బలి చక్రపురం తండాకు చెందిన ఐదుగురు వ్యక్తులు గొర్రెల దొంగతనానికి వచ్చి ముగ్గురు పట్టుబడ్డారు. ఐదు రోజుల క్రితం దండు గ్రామ పరిధిలో ఆగిన గొర్రెలో 15 గొర్రెలు ఎత్తుకెళ్ళగా శనివారం రాత్రి మళ్ళీ వచ్చి పట్టుబడ్డారు. వారు ఉపయోగించిన టాటా సుమో వాహనాన్ని మక్తల్ పోలీసులకు అప్పగించి ఫిర్యాదు చేశారు కురువ సాబెణ్ణ.

వివరాల్లోకెళితే మక్తల్ కు చెందిన కురువ సాబెణ్ణ చందాపూర్ గ్రామ శివారులో రొడ్డు పక్కన ఉన్న పొలంలో గొర్రెలను ఆపి చుట్టూ వలకట్టి నిద్రిస్తున్నాడు. రాత్రి సమయంలో కొందరు గుర్తుతెలియని వ్యక్తులు గొర్రెల మందలు ఆగిన స్థలానికి కొద్ది దూరంలో టాట సుమో వాహనంలో వచ్చారు. వాహనం నుంచి కొందరు వ్యక్తులు దిగి గొర్రెల మందకు దగ్గరకు వస్తుండగా అనుమానం వచ్చి గొర్రెలకు కాపలా ఉన్న వారందరూ అప్రమత్తమై పట్టుకునేందుకు ప్రయత్నించగా ముగ్గురు వ్యక్తులు పట్టుబడ్డారు. పట్టుబడిన వారిని, వారు ఉపయోగించిన టాటా సుమో వాహనాన్ని మక్తల్ పోలీసులకు అప్పగించారు. తప్పించుక పోయిన ఇద్దరి కోసం పోలీసులు గాలిస్తున్నామన్నారు.


Similar News