శారద, హిడ్మాల ఆరోగ్యంపై క్లారిటీ ఇచ్చిన మావోయిస్టు నేత జగన్

దిశ ప్రతినిధి, కరీంనగర్: మావోయిస్టు పార్టీకి చెందిన శారద, హిడ్మాలు తీవ్ర అనారోగ్యంగా ఉన్నారంటూ దుష్ప్రచారం చేస్తున్నారని మావోయిస్టు పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి జగన్ ఒక ప్రకటనలో తెలిపారు. తప్పుడు ప్రచారంతో వారి కుటుంబ సభ్యులను, ప్రజలను గందరగోళంలో పడేయాలన్న కుట్ర జరుగుతోందని ఆయన పేర్కొన్నారు. తీవ్ర అనారోగ్యానికి గురైన గంగాల్, సోబ్రాయ్ లను చికిత్స నిమిత్తం ఆసుపత్రులకు పంపిస్తే వారిని అరెస్ట్ చేసి వైద్యం అందుకుండా హత్య చేశారన్నారు. కుటిల నీతితో వ్యవహరించిన ప్రభుత్వం, […]

Update: 2021-06-28 04:04 GMT

దిశ ప్రతినిధి, కరీంనగర్: మావోయిస్టు పార్టీకి చెందిన శారద, హిడ్మాలు తీవ్ర అనారోగ్యంగా ఉన్నారంటూ దుష్ప్రచారం చేస్తున్నారని మావోయిస్టు పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి జగన్ ఒక ప్రకటనలో తెలిపారు. తప్పుడు ప్రచారంతో వారి కుటుంబ సభ్యులను, ప్రజలను గందరగోళంలో పడేయాలన్న కుట్ర జరుగుతోందని ఆయన పేర్కొన్నారు. తీవ్ర అనారోగ్యానికి గురైన గంగాల్, సోబ్రాయ్ లను చికిత్స నిమిత్తం ఆసుపత్రులకు పంపిస్తే వారిని అరెస్ట్ చేసి వైద్యం అందుకుండా హత్య చేశారన్నారు. కుటిల నీతితో వ్యవహరించిన ప్రభుత్వం, పోలీసులు నమ్మించేందుకు శ్రేయోభిలాషుల్లాగా హితులు పలుకుతున్నారని జగన్ దుయ్యబట్టారు.

మావోయిస్టు పార్టీని అంతమొందించాలన్న లక్ష్యంతో నిర్భందాన్ని తీవ్రతరం చేశారన్నారు. ఈ కారణంగానే హరిభూషన్, భారతక్కలకు పార్టీ సరైన వైద్యం అందించలేకపోయిందని వివరించారు. అయితే వీరిద్దరి మరణానికి ముందు రోజు సమాచారం అందుకున్న గ్రేహౌండ్స్, ఛత్తీస్‌గడ్ పోలీసులు పెద్ద ఎత్తున కూంబింగ్ నిర్వహించారని, దీంతో వారిద్దరిని మోసుకుంటూ వెనక్కి తిరిగి వెళ్లిపోయామన్నారు. శారద, హిడ్మా చనిపోయారని ప్రచారం చేస్తూ ప్రజల్లో గందరగోళం సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నారని జగన్ ఆరోపించారు. కరోనాకు తామేమీ అతీతులం కామని, ప్రజల మధ్యే జీవిస్తూ అన్ని వర్గాల ప్రజలను కలుస్తుంటామని ఈ కారణంగా తమకు కరోనా సోకే అవకాశం ఉంటుందని జగన్ స్పష్టం చేశారు.

Tags:    

Similar News