మా సమస్యలపై ప్రశ్నించండి..

దిశ ప్రతినిధి, మహబూబ్ నగర్ : తమ సమస్యల పై గళం విప్పాలని దేవరకద్ర నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు టీపీసీసీ కార్యదర్శి మధుసూదన్ రెడ్డి CLP నేత భట్టి విక్రమార్కను కోరారు. నియోజకవర్గంలోని వివిధ సమస్యలను ఈ సందర్భంగా ఆయన దృష్టికి తీసుకొచ్చారు. నియోజకవర్గంలోని సరళ సాగర్ ప్రాజెక్ట్ పనుల్లో టెండర్లు పిలవకుండా రూ.6 కోట్ల విలువ చేసే పనుల టెండర్లను నామిని ప్రకారం కేటాయించినట్లు వివరించారు. దీని కారణంగా ప్రాజెక్టు పనుల్లో జరిగిన అవినీతిపై, ఇసుక […]

Update: 2020-09-06 00:02 GMT

దిశ ప్రతినిధి, మహబూబ్ నగర్ :

తమ సమస్యల పై గళం విప్పాలని దేవరకద్ర నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు టీపీసీసీ కార్యదర్శి మధుసూదన్ రెడ్డి CLP నేత భట్టి విక్రమార్కను కోరారు. నియోజకవర్గంలోని వివిధ సమస్యలను ఈ సందర్భంగా ఆయన దృష్టికి తీసుకొచ్చారు. నియోజకవర్గంలోని సరళ సాగర్ ప్రాజెక్ట్ పనుల్లో టెండర్లు పిలవకుండా రూ.6 కోట్ల విలువ చేసే పనుల టెండర్లను నామిని ప్రకారం కేటాయించినట్లు వివరించారు.

దీని కారణంగా ప్రాజెక్టు పనుల్లో జరిగిన అవినీతిపై, ఇసుక దోపిడీపై చెప్పుకొచ్చారు. అలాగే కర్వేన ప్రాజెక్ట్‌లో జరుగుతున్న నాసిరకం పనుల వలన , మొన్న 4 రోజులుగా కురిసిన వర్షాలకు ప్రాజెక్ట్ 13వ ప్యాకేజీకి గండి పడిన విషయాలను ఆయన దృష్టికి తెచ్చారు. నియోజకవర్గ సమస్యలపై అసెంబ్లీ సమావేశాల్లో చర్చించి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు.

Tags:    

Similar News