వెళ్ళిపోతున్నా
భూమికీ నాకున్న ఋణం తీరింది.
ఖాళీ చేతులతో వచ్చా,
ఖాళీ చేతులతో వెళ్తున్నా.
భూమికి ఏమీ ఋణం లేదు,
వెళ్లేటప్పుడు ఏమీ తీసుకుపోలేను.
ఇక్కడే కలలు కన్నాను,
ఇక్కడే కష్టపడ్డాను,
ఇక్కడే సంపాదించాను,
ఇక్కడే కోల్పోయాను.
కొన్ని జ్ఞాపకాలను మాత్రం మిగిల్చాను.
బాల్యం ఆస్వాదిస్తూ పెరిగాను,
కుటుంబ భారాన్ని మోసాను.
ఇల్లు ఇల్లాలు
పిల్లలు ప్రేమలు.
బంధాలు అనుబంధాలు
కర్తవ్యం, కర్మవ మధ్య సమతుల్యం
నా జీవన యానం.
విశ్వనాటకంలో నాదో
చిన్న పాత్ర.
జననం ప్రథమ అంకం,
మరణం చరమాంకం.
ఇదే జగన్నాటకం.
ఇదే నిగూఢమైన జనన రహస్యం.
రాము కోలా
98490 01201