మంత్రాంగం

Poem

Update: 2025-01-06 00:15 GMT

ఒక వైపు తుపాను

ఒకవైపు అంతర్ఘర్షణ

ఒక వైపు ప్రజారక్షణ

నాల్గోవైపు కుర్చీ బలోపేతం

ఇది పాలన యంత్రాంగం

ముఖ్య అధిపతి చందరంగం...

బుద్ధుడి మౌనం

అశోక చక్రం నిశ్చలత

సామాన్యుడి గుండె నిబ్బరం

చలన శక్తిగా మారితే

ఓ కొత్త కేతం

ఓ కొత్త చేతన...

యంత్రాంగం మారుతుంది

ప్రజా పాలన వస్తుంది

నిజంగానే నియంతృత్వం

పలాయన మంత్రం పఠిస్తుంది

రేడియమ్

92915 27757

Tags:    

Similar News

భయం