పదవోయి ముందుకు నువ్వు
నమ్మవోయి నిన్ను నువ్వు
నీకు తెలుసు ముందంటే భయం
నీవు చూసిన వెనుకటిదే నిజం
నాడు చేయని ప్రయత్నం
నేడు భయంతో జీవిస్తున్న వైనం
అందుకే నీకు ముందంటే భయం
ఎవరితో చెప్పలేవు ఈ చేదు నిజం
చేయి నువ్వు ఓ చిన్ని ప్రయత్నం
అది రూపుమాపును నీలోని భయం
పదవోయి ముందుకు నువ్వు
నమ్మవోయి నిన్ను నువ్వు
డా. మైలవరం చంద్ర శేఖర్
81870 56918