ఈ సెప్టెంబరు ప్రత్యేకమైనది

Poem

Update: 2024-12-01 23:45 GMT

ప్రియతమా

ఈ సెప్టెంబరు ప్రత్యేకమైనది

నువ్వు వెళ్లిపోయావు

నీ జ్ఞాపకాలతో నేను ఎదబాదుకుంటున్నా

ఏ యుద్ధమూ ఆగలేదు

దేవుడికి మతి చెల్లించి

యుద్దమాపమని ఇల్లిల్లు తడుతున్నాడు

అతని ప్రియ పుత్రుడు, ఇజ్రాయిల్

ప్రతి పరికరాన్ని బాంబుగా మలుస్తున్నాడు

దేవుడు నిస్సహాయంగా

ఇజ్రాయిల్ తలుపు తడుతున్నాడు

ఠక్..ఠక్..ఠక్

వెంట వెంట

చిల్లులు పడే శబ్దం

దేవుడు పేజర్‌గా పేలిపోతున్నాడు

దేవుడు గద్దెనుండి మాయమయ్యాడని

పూజారి ప్రకటిస్తాడు

"దేవుని పేరుమీద సాయం చేయండయ్యా "

బిచ్చగాడు గుడిమెట్ల మీద అరుస్తుంటాడు

కాకి రెట్ట వేసి ఎగిరిపోతుంది

ప్రియతమా

ఈ సెప్టెంబర్ ప్రత్యేకమైనది

మా నర నరాన

చావు వాసన జీర్ణించుకు పోయింది

రుచి, వాసన చచ్చిపోయాయి

ఘ్రాణ గ్రంధులన్నీ మూసుకుపోయాయి

నాయన మాత్రం

అమ్మను ఎప్పటిలాగే

బండ బూతులు తిడుతున్నాడు

చర్మం మొద్దుబారిపోయింది

నువ్వు వెళ్లిపోయావు

కానీ అంతటా నువ్వే

ఎంతగా ఏడ్చి మొత్తుకున్నా

ఎవరూ పట్టించుకోరు

ఎదనుండి

పక్షి ఎగిరిపోయాక

నేనొక శూన్య పుటెడారిని

ప్రియతమా

నా బాహువుల్లోకి రా

లేదా మృత్యువునైనా ప్రసాదించు

ఈ సెప్టెంబర్ ప్రత్యేకమైనది

చావు మాత్రమే

ఇక్కడ శాంతినిస్తది

(మోమితా ఆలం కవిత". It is a strange September"కు అనువాదం)

-ఉదయమిత్ర

89196 50545

Tags:    

Similar News

మంత్రాంగం

భయం