పొద్దున్నే లేచి పోయి పూదీంచేది
పూజించి పోయిరా జెసి
రాజేసిన పోయిపై అంబటేసరువెట్టి
కడప కడిగి కలాపిసల్లి
అకిట్లో అందంగా ముగ్గే ట్టేది
తైద అమ్మలికాసి జొన్న రొట్టెలు చేసి
అంబటాలకు అమ్మ వంట అయిపోయేది
పెచ్చులూడిన
తలుపుకు పెండ రుసి
సుందరంగా తలుపు
సూచెటట్లు చేసేది
మట్టి మిద్దెలు గోడలు
మా అమ్మ
శుద్ధ మట్టి తోటి శుభ్రంగా పూసి
సున్నం సారుకలు పోసేది
ఎర్ర మట్టి పేడేసి ఈగురంగా
మాయమ్మ ఇడుపులు అలికేది
అమ్మ అలికిన ఇల్లు
అందాల ప్రపంచ సుందరి
పూరి గుడిసెల అమ్మ పుట్టి పెరిగింది
పేదింటిరాలైన పెద్ద మనసు ఉండేది
బాధలేనున్న భారీ గుణం ఉండేది
ఆకలి కొన్నలకు అడిగి అమ్మలి పోసేది
దేవరపాగ కృష్ణయ్య
99634 49579