జీవ స్వేచ్ఛ

Poem

Update: 2024-11-25 00:30 GMT

ప్రతి ఉదయం

ఓ ఆనందం

ప్రతి ఉదయం

ఓ కొత్తదనం

ఋతువు ఋతువుకు

యాన యానానికి

ఉదయరసరమ్య గీతాలు

ప్రకతిలో పురివిప్పే కేకి అందాలు...

ఆకాశంలో పక్షులు

ఆహారం కోసం

ప్రత్యూష రాగాలాపనకు

రెక్కల లయగీతాల తో

సాగె గగన దృశ్యం

చిత్రకారుడికి ఫోటో గ్రాఫర్ కు

చిక్కి మనముందు కనువిందు చేస్తాయి...

ఉదయం నాగళ్లు కాడెద్దులకు కట్టి

పొలాలకు బయలుదేరిన రైతులు

నాకు ఆకాశం లోని పక్షుల గుంపులా

కనువిందు చేస్తున చిత్రాలు భళారే

పైన కింద అన్నివైపుల జీవుల్లో

ఆకలి ఆకలి పోరే

జీవగంజి పోరే

పోరాటం ప్రకృతి నే‌ర్పిస్తుంది

జగన్నాటకం విశ్వంలోనే ఉంది

నాటకం ముగిసిందా

ఆ ఆ పాత్రలు అంతర్ధానమౌతాయి

ఆకట్టుకున్న పాత్రలు కథలై మిగులు తాయి

రేడియమ్

92915 27757

Tags:    

Similar News

మంత్రాంగం

భయం