రూపకం

Poem

Update: 2024-11-10 22:45 GMT

విదూషకుడు

వేదిక మీద అతడు

నవ్వుతూ నవ్విస్తూ

ఆహార్యము సంభాషణ చతురత

కథా సంవిధాన సమన్వయం

గాలిపటం

ఆకాశం హద్దుగా

వయ్యారాలు పోతూ ఎగురుతుంది

దారం ఆధారం చేతిలోనే ఉంటుంది

ఏమైందో ఏమో క్షణంలో

అవుట్ ఆఫ్ కవరేజ్ అయ్యి

బేలగా లీలా హేళగా నేల వాలుతుంది

ఆమె

ఏమీ అన్నా అనకున్నా

ఆమె క్రీస్తు సిలువ ముందు

మోకరిల్లిన ఆమెన్

కన్పెన్షన్ బాక్స్ ముందు

కన్విక్షన్ సంభాషణ

ప్రేక్షకుడు

యధాశక్తి రక్తి కట్టిస్తున్న నాటకాన్ని

చూసి చూసి విరక్తి

చప్పట్లు కొట్టలేక వహ్వా అనలేక

వినికిడి చూపు మాట కోల్పోయి

దిగ్బ్రాహ్మలో కంజాన శ్రోత

-జూకంటి జగన్నాథం

94410 78095

Tags:    

Similar News

మంత్రాంగం

భయం