భూదేవి శాపం

Poem

Update: 2024-11-10 23:30 GMT

గత జన్మ నుండి హఠాత్తుగా మేల్కొని

వాకింగ్‌కని బయల్దేరా

నడక నాకు కొత్త అయినట్టే

షూలకీ నా కాలు కొత్త

ప్రతీకారేచ్ఛతో పిచ్చగా కరిచేసాయి

కుంటాను, గెంతాను

కాసేపు ఆగాను

ఛా.. ఆఫ్ట్రాల్ కాలి కింద చెప్పుకి

లొంగిపోవడమా? అని

మొండిగా ముందుకే సాగా

విజయదరహాసంతో ఇంటికి చేరి

షూ వైపు చూస్తే ఏదో మరక.

నిర్లక్ష్యంగా తీసి ర్యాక్‌లోకి విసిరేసా

సాక్స్ విప్పుతుంటే, తడి

ఏంటాని చూస్తే, చేతులు ఎరుపెక్కాయి.

అది రక్తం.. నా రక్తం.

ఓ నిమిషం నిర్వేదం.

కోపంగా సాక్స్‌ను

ఎడం చేత్తో ఘాఠిగా పిండేశా,

ఎందుకో కర్ణుడు గుర్తొచ్చాడు.

- దేశరాజు

99486 80009

Tags:    

Similar News

మంత్రాంగం

భయం