త్యాగాల కల్పవల్లి

Poem

Update: 2024-11-11 00:15 GMT

నువ్వు పుట్టి పురుడోసుకున్నవో లేదో కానీ

ఏ అవ్వ బొడ్డు పేగు కోసి పేరు పెట్టిందో

నీవు నిజంగానే పేదల ఇంటి గుమ్మాల

రంగవల్లి వయ్యి నిలిచావు..!

ఏ అసుర సంధ్యా తీరానా

నువ్వు అడుగులు నేర్చావో కానీ

అవి ఆకలి కడుపుల అన్నార్థుల జాడలు

వెతక పయనమయ్యాయి

ఏ ఇంటి కడుపు పంటవయి పండావో కానీ

కడుకు జనులకు సోపతయ్యావు

పల్లెలో అక్షరాలు దిద్దిన నీ చేతి మునివేళ్లు

పట్టణం బాటలో పయనించి విశ్వవిద్యాలయాలో

మొగ్గతొడిగిన పొలిటికల్ కమీసార్ వయ్యావు

బిగి పిడికిలి జెండా పిలుపులో నువ్వు సాగిన

ఆ కల్లోల ప్రాంతపు అరాచకాలను చూసి

చలించిన నీ మనస్సు

బాల్య వివాహాలను వ్యతిరేకించిన దృశ్యం

నేటి భారతంలో ఇంకా కొనసాగుతూనే ఉన్నది కదా

ఏ ఇందూరు పోరు సమరమో కానీ

అది కత్తుల వంతెనల మీద నడిచి

గుంటూరు పల్నాడుకు చేరిందో

దివిసీమ ప్రజల కన్నీళ్లు తుడిచేయ్యగా

ములుగులో నేల రాలి ఉదయించిన

తొలి పొద్దు వర్ణమో ఆమె

ఈ ధరణిలో విరబూసిన

త్యాగాల కల్పవల్లి రంగవల్లి…!

(రంగవల్లి పాతికేండ్ల అమరత్వానికి పబ్బతి పడుతూ…)

-వంగల సంతోష్

95737 86539

Tags:    

Similar News

మూసీ