తోపుడు బండి

Poem

Update: 2024-11-11 00:15 GMT

నేలపై

తోపుడు బండి

పుస్తకం విడిచి వెళ్ళింది

సాధిక్‌తో పంచుకున్న

పుస్తకాలను జ్ఞాపకంగా

మిగిలించి వెళ్ళాడు ..!

విడిచిన పుస్తకాల

ఊపిరిని పీల్చుకుందాం..!

ఒక్కొక్క ఊళ్లో

ఒక్కొక్క అక్షరాలను చల్లుకుంటూ

పుస్తకాల జ్ఞానాన్ని

చరిత్ర నీడల్లో నిలిపి

రాజధాని నుండి

కుగ్రామం దాకా

సాధిక్ తెచ్చిన పుస్తకం

మనిషిలోంచి మనిషిలోకి

స్రవించే పుస్తకం

తరంలోంచి తరంలోకి

ద్రవించేది పుస్తకం

మనిషిని బతికించే

భావానికి పునాది

మనిషిని కదిలించే గీతానికి

తోలి గీత గీసేది పుస్తకం

క్షరమైపోయిన ప్రపంచానికి

ఆశగా నిలిచేది పుస్తకం

కనుమరుగైన పుస్తకాలని

ఇంటి ముందు తెచ్చిన

పుస్తకాల తోపుడు బండి

ఇక ఆగిపోయిది..!

(తోపుడు బండి సాదిక్ ఆలీ స్మృతిలో)

శోభరమేష్

89786 56327

Tags:    

Similar News

మూసీ