వాకింగ్‌లో ఉన్నా బ్రిడ్జిపైన
ఒక జంట దూకేసింది
తీర్చలేని అప్పులో
సరిదిద్దుకోలేని తప్పులో తెలియదు
పిఎస్‌కి ఫోన్ చేశాను
వన్ నాట్ ఎయిట్‌కి మెసేజ్ పెట్టాను
రాత్రి గొడుగు విప్పుకుంది మెల్లగా..
ఉదయమే మళ్లీ
వాకింగ్‌లో వచ్చి స్పాట్‌కి చేరుకొన్నాను
చీకటి మింగేయ్యలేదు కదా ఆ జంటని
నీళ్లు తాళ్ళు పేని ఉరివేయలేదు కదా ఆ జంటని
ఔననే అన్నట్టు
నిమ్మళంగా నది ప్రవహిస్తుంది
-కోటం చంద్రశేఖర్
9492043348