మంచు దుప్పటి కప్పుకున్న
పుట్ పాత్‌లు
కలత నిదురకు వేదికలు
ఆకలికి అలమటించే అనాథలకు
గుండె కొతలతో ఇల్లు విడిచిన అభాగ్యులకు
పుట్ పాత్‌లే వెచ్చని వస్త్రము
ఒక్కోసారి ధృతరాష్ట్రుని కౌగిలి
పాదచారుల పద సవ్వడి
విని విని విసిగి వేసారి
నిదరించిన కుక్కపిల్లలా
యవ్వనాన్నంత రహదారి కప్పగించి
జరత్వాన్ని తీసుకున్న యదువులా
పుట్ పాత్‌లు
పేరుకు మహా నగరమైన
పుట్ పాత్‌ల వలె
మానవ బంధాలు ఇరుకైనవి
రాత్రంతా కాపలా కాసి కాసి
ఆదమరిచి నిదరించిన శునకాలు
గగనం నుంచి టమాటలు జారవిడిచినట్లు
పుట్ పాత్ సరిహద్దుల సాక్షిగా
నిత్యం రోడ్లపై చివరి శ్వాస తీస్తాయి
మానవ కర్తవ్యాలు కఠినమైనవీ
మనుష్యుల కళేబరాలను పట్టించుకొని
తీరిక లేని పనులలో పుట్ పాత్‌లే ఓదార్పు
-ఐ. చిదానందం
88014 44335