తొడుగు

Poem

Update: 2024-10-27 23:15 GMT

కష్టజీవికి పగుళ్ళే తొడుగు

తెగిన తొడుగుకు

పిన్నుల, కుట్టిన ఆపరేషన్‌ల

అలంకారాలు

ధన భాండాగారంలో

తొడుగుకు లేదు బడ్జెట్

ముళ్ళపై పరుగు పందాలు

కాలినా పచ్చనిపైరు చల్లదనం

మైళ్ళకొద్దీ నడకల కొలతలు

పరుపుల పట్టింపులు అసలు లేవు

అరిగినకాలికి అందమైన తొడుగు

తోటలో విహరించి విలాసంగా‌

గెంతులు వేయ అరిగిన అలంకారమా

నీకు అభినందనలు

- అరుణ కమల

96764 43185

Tags:    

Similar News

మంత్రాంగం

భయం