వైకల్యమా అతనెప్పుడూ అనుకోలేదు
ఈ రాజ్యమే వైకల్యంతో
నిండి ఉంది
ఎందుకు?
పదేళ్ల తర్వాత నిర్దోషిగా చెప్పారు
ఆ పదేళ్లు వారికి
నిద్ర లేకుండా చేశాడు అందుకేనేమో!
దేహాన్ని కృశింప చేశారు
ఇంతకన్నా మీరేం చేస్తారు
నన్ను అన్నాడు తను
అండా సెల్.. అక్కడ కూడా
అతని పాఠాలు ఆగలేదు
ఆ నేత్రాలు చూస్తున్నాయి
చూస్తూనే ఉంటాయి అవి
ఇంకొకరి దేహంలో
సమ సమాజ స్థాపన కోసం
వస్తున్నాయి అవి
- సోమాల లక్ష్మి
97052 40314