నాకు యుద్ధం కావాలి

Poem

Update: 2024-10-27 21:30 GMT

నాకు యుద్ధం కావాలి

అణు ఇంధనం

అణువంత నేలపైన

మిగల కూడదు

అందుకే నాకు యుద్ధం కావాలి

పోయిన వాళ్లు మంచోళ్లు

ఉన్న వాళ్లు మంచోళ్లు అంటే

నేను అసలే ఒప్పుకోను

భూ భారం యుగాల తరబడి

పెరిగి పోతోంది

త్రాసు ముల్లు నిశ్చల స్థితిలో ఉండాలి

అందుకే నాకు యుద్ధం కావాలి

యుద్ధాల భయాలతో

ఎన్నాళ్ళు బతకాలి

రాజాధికా‌రాలు ధ్వంసం కావాలి

యుద్ధ ట్యాంకులు మందుగుండు

అంతా శూన్యంలో కలసి పోవాలి

నేల కాలుష్య రహితం కావాలి

యుద్ధాలు రాక తప్పవు

ఋతు చక్రంలో శాంతి రాక తప్పదు...

మారణాయుధాలు లేని నేల

పండువెన్నెల సోయగాలతో

వెలుగులు చిమ్మె సూర్య ప్రభలతో

కొత్త లోకం కొత్త కాంతి శాంతి

నేల కొత్త విత్తుకై ఎప్పుడు

ఎదురు చూస్తునే ఉంది

పుట్టుక వెంటనే చావు ఉంటుదనే

సత్యాన్ని మరిచి పోకు

శాంతి లోక స్థాపనకై

నాకు యుద్ధం కావాలి

రేడియమ్

92915 27757

Tags:    

Similar News

తొడుగు