అతని నవ్వులంటే భయమెందుకు? 

Poem

Update: 2024-10-27 18:45 GMT

పాలకులు నవ్వడం 

ప్రేమించడం కలగనడం 

ఎప్పుడో మర్చిపోయారు 

అందుకేనేమో

చక్రాల కుర్చీలోని కవినీ

సునిశిత మేధావినీ జైల్లోకి తోసి

చిత్రహింసలతో ఛిద్రం జేసి

నవ్వులని ఆపాలని చూశారు

అయినా వాళ్ళు

అలా నవ్వుతూనే ఉన్నారు 

వాళ్ళ నవ్వుల్లో 

ఉజ్వల భవిష్యత్తు మీద ఆశ 

వసంతంలా విరబూస్తుంటది

మూలం .. మౌమితా ఆలం ..

("why are they so afraid of his smile"కు స్వేచ్ఛానువాదం)

- ఉదయమిత్ర

89196 50545

Tags:    

Similar News

తొడుగు