ఆపడం సాధ్యమా...

Poem

Update: 2024-10-20 23:15 GMT

మంటలను ఆర్పగలరు

మాటలనూ.......?

ప్రవాహాన్ని అడ్డగించగలరు

ప్రశ్నలనూ .......?

భాషను బంధించగలరు

భావజాలాన్నీ.......?

నివురుని ముట్టగలరు

నిప్పునీ .......?

మనిషిని దెబ్బతీయగలరు

మనోధైర్యాన్నీ ‌.......?

అరచేయిని అడ్డుంచగలరు

సూర్యోదయాన్నీ ......?

అసత్యాన్ని ప్రచారం చేయగలరు

సత్యాన్ని సమాధి చేయడం......?

ఉద్యమాలను ఆక్రమణలతో

అణచివేతలతో ఆపడం సాధ్యమా ....?

(ప్రొ. జిఎన్ సాయి బాబాకు అక్షర నివాళి)

డా. ఎడ్ల కల్లేశ్

98667 65126

Tags:    

Similar News

మంత్రాంగం

భయం