Emojis: ఎమోజీస్.. సరిగా అర్థం కాలేదా?
అమ్మకు గుడ్ మార్నింగ్ మెసేజ్‌తో పంపే ఒక 'స్మైలీ ఫేస్' నుంచి సహోద్యోగి నుంచి వచ్చే సందేశానికి 'థంబ్స్ అప్'తో ప్రతిస్పందించడం వరకు మన రోజులు ఎమోజీలతోనే ప్రారంభమై, తిరిగి వాటితోనే ముగుస్తాయి.. Latest Telugu News
దిశ, ఫీచర్స్ : అమ్మకు గుడ్ మార్నింగ్ మెసేజ్‌తో పంపే ఒక 'స్మైలీ ఫేస్' నుంచి సహోద్యోగి నుంచి వచ్చే సందేశానికి 'థంబ్స్ అప్'తో ప్రతిస్పందించడం వరకు మన రోజులు ఎమోజీలతోనే ప్రారంభమై, తిరిగి వాటితోనే ముగుస్తాయి. ఇక రోజువారీ జీవితంలో ఎక్కువ భాగం ఆన్‌లైన్‌లోకి మారినందున, డేటింగ్ నుంచి వర్కింగ్ వరకు ఎమోజీలే ఆధునిక కమ్యూనికేషన్‌లో ప్రధాన పాత్ర పోషిస్తున్నాయి. కానీ మీరు పంపిన విశాలమైన నవ్వుతో కూడిన ఎమోజీని సహోద్యోగి మీ భయాందోళనకు చిహ్నంగా అన్వయించుకోవచ్చనే భయం నేపథ్యంలో మనం నిజంగా ఈ కమ్యూనికేషన్ సాధనాలపై ఆధారపడవచ్చా? వాస్తవంగా ఎమోజీకి భిన్నమైన వివరణలకు ఇదే కారణమవుతుందా? చూద్దాం..
ఎమోజీలు ఎందుకంత పాపులర్?
ఎమోజీలు 1990లో జపనీస్ మొబైల్ ఫోన్స్‌లో ఉద్భవించిన 'పిక్చర్ క్యారెక్టర్స్'. కానీ అవి ఇతర మొబైల్ ఆపరేటింగ్ సిస్టమ్స్‌కు జోడించబడిన తర్వాతే ప్రపంచవ్యాప్తంగా ప్రజాదరణ పొందాయి. వాటి విస్తృత లభ్యతతో పాటు టైప్ చేసిన సంభాషణల్లో భావోద్వేగాలను ప్రదర్శించడంలో కూడా ఎమోజీలు సాయపడతాయి. 2019 అధ్యయనం.. ఎమోజీ ఫేసెస్ ముఖాముఖి సంభాషణకు సమానమైన నాడీ కార్యకలాపాలు పొందగలవని చూపించింది. అందువల్ల, ఎమోజీలు తరచూ ఒక ప్రాథమిక సాధనంగా ఉపయోగించబడతాయి. కొన్నిసార్లు అనుకోకుండా సానుభూతి చూపించడానికి, ఒక వ్యక్తిని మరింత సౌకర్యవంతంగా చేయడానికి కూడా తోడ్పడుతున్నాయి.
అయితే, కాలక్రమేణా మెసేజింగ్ ప్లాట్‌ఫామ్స్ అభివృద్ధి చెందడంతో ఇప్పుడు వివిధ రకాల స్టిక్కర్స్, gifలు కూడా ఉన్నాయి. అయినా వరల్డ్‌వైడ్ యూజర్లు ఇప్పటికీ ఎమోజీలనే ఎందుకు ఇష్టపడుతున్నారు? అంటే.. ఇందుకు మూడు కారణాలున్నాయని ఎమోజిపీడియా(ఎమోజి రిఫరెన్స్ వెబ్‌సైట్) ఎడిటర్-ఇన్ చీఫ్, ప్రపంచంలోని మొట్టమొదటి ఎమోజి అనువాదకుడైన కీత్ బ్రోని చెప్పాడు. 'ఎమోజీలు అన్ని పరికరాల్లో ఉచితంగా అందుబాటులో ఉంటాయి. ఎమోజీలకు ఎమోటికాన్స్ వంటి యూజర్ల నుంచి ఎటువంటి చురుకైన ప్రయత్నం అవసరం లేదు. స్టిక్కర్స్, జిఫ్స్ వలె కాకుండా నేరుగా టెక్స్ట్‌కు అనుగుణంగా ఉంచబడతాయి. కాబట్టి లైన్స్‌లో మెరుగ్గా విరామ చిహ్నాన్ని కలిగి ఉంటాయి.
ఎమోజీలు అన్ని చోట్లా ఒకేలా ఉన్నాయా?
ఎమోజీలు వేర్వేరు పరికరాలు, ప్లాట్‌ఫామ్స్, ఆపరేటింగ్ సిస్టమ్స్‌లో విభిన్నంగా కనిపిస్తాయి. యాపిల్, సామ్‌సంగ్, మైక్రోసాఫ్ట్, ఫేస్‌బుక్, ట్విట్టర్ అన్నీ కూడా ఎమోజీలకు సంబంధించి వ్యక్తిగత రెండరింగ్స్ కలిగి ఉంటాయి. అవి స్థానభ్రంశం చెందిన కనుబొమ్మలు లేదా అప్పుడప్పుడూ నవ్వుతూ ఉంటాయి. 'మేము పిలిచే వివిధ విక్రేతలు(తమ స్వంత ఎమోజీలను కలిపి ఉంచే కంపెనీలు) వారి ఎమోజీలను యూనికోడ్ (క్యారెక్టర్ ఎన్‌కోడింగ్ కోసం ప్రమాణాల విభాగం) సిఫార్సుల ఆధారంగా డిజైన్ చేస్తారు. వారు యాపిల్ వంటి వాటిపై కాపీరైట్ కలిగి ఉన్నారు. వారి ఎమోజి ప్లాట్‌ఫామ్ సౌందర్యానికి అనుగుణంగా, ప్రత్యేకంగా ఉండాలని ఎప్పుడూ కోరుకుంటారు' అని బ్రోని చెప్పారు. యూనికోడ్ ఎమోజి పేర్లు డిజైన్‌లో ఖచ్చితమైన స్వభావానికి సంబంధించి సూచించబడతాయి. ఉదాహరణకు, రెప్పపాటు కన్నుతో ఉన్న ఎమోజీకి 'ఒక కన్ను కనపడుతూ నాలుక కనిపించేలా నవ్వుతూ' అనే వివరణ ఉంటుంది. అవి బోధనాత్మకమైనవి, అయినప్పటికీ సృజనాత్మక వివరణకు ఇంకా స్పేస్ ఉందని బోని తెలిపారు.
అయితే, ప్లాట్‌ఫామ్ కమ్యూనికేషన్‌లో మిస్‌కమ్యూనికేట్ అనేది చెంప(చీక్)కు సంబంధించి నిర్దిష్ట ఛాయ లేదా కనుబొమ్మల వాలు వంటి ఎమోజి డిజైన్‌లోని 'న్యూన్స్' కారణంగా ఏర్పడుతుందని 2018 అధ్యయనం వెల్లడించింది. ఇక ఎమోజీ గ్రాఫిక్ స్వభావం.. సూక్ష్మ వ్యక్తీకరణతో పాటు మరింత వివరణాత్మక శ్రేణిని కూడా అందిస్తుంది.
అత్యంత ప్రజాదరణ పొందినవి?
వ్యక్తిగత వినియోగదారులకు వేర్వేరు ప్రాధాన్యతలు ఉన్నప్పటికీ, యూనికోడ్ ఎమోజి సబ్‌కమిటీ చైర్ విడుదల చేసిన 2021 ఎమోజి ఫ్రీక్వెన్సీ నివేదిక ప్రకారం, టాప్ 100 ఎమోజీలు.. మొత్తం ఎమోజి షేర్లలో 82 శాతం ఉన్నాయి. యూనికోడ్, అదే నివేదికలో వాడుక ప్రకారం 'హ్యాండ్, స్మైలీ' అత్యంత ప్రజాదరణ పొందినవి కాగా.. జెండాలు అత్యంత తక్కువ ప్రజాదరణ పొందాయి.
ఏజ్, కల్చర్, ప్లాట్‌ఫామ్ యూసేజ్ :
ఆఫీస్‌లో ఎమోజీ వినియోగ పరిణామంపై స్లాక్, డ్యుయో లింగో చేసిన తాజా అధ్యయనంలో యంగ్ జనరేషన్స్.. తాము పంపిన ఎమోజీని తప్పుగా అర్థంచేసుకున్నారని నివేదించినట్లుగా కనుగొన్నారు(31 శాతం Gen Z, 24 శాతం మిలీనియల్స్). సర్వేచేయబడిన వారు.. వారి వయస్సు లేదా అంతకంటే తక్కువ వయసున్న వారికి ఎమోజీని పంపే అవకాశం కూడా ఎక్కువగా ఉంది. అయితే 28 శాతం మంది ప్రతివాదులు వారి ఎమోజి వినియోగం విషయానికొస్తే వయసు గురించి పట్టించుకోలేదు.
2020 అధ్యయనంలో వినియోగదారు వయసు ఆధారంగా ఎమోజీ వివరణలో తేడా ఉందని కనుగొన్నారు. పాత ప్రతివాదులు ఎమోజీని అక్షరాలా అర్థం చేసుకునే అవకాశం ఉంది. అయితే యువ ప్రతివాదులు కమ్యూనికేషన్‌లో మృదుత్వం, టోన్ సవరణ వంటి మరింత వియుక్త, సాంప్రదాయిక విధులను ఇష్టపడతారు.
'కొన్ని ఎమోజీలు ప్లాట్‌ఫామ్ ప్రేక్షకుల ఆధారంగా నిర్దిష్ట అర్థాలను తీసుకుంటాయి. ఉదాహరణకు, పుర్రెను 'నవ్వడం ద్వారా మరణం'గా ఉపయోగించడం టిక్‌టాక్‌లో సరిగ్గా అర్థం చేసుకోవచ్చు. కానీ ట్విట్టర్/ఫేస్‌బుక్‌లో తప్పుగా అర్థం చేసుకోవచ్చు' అని బ్రోని చెప్పారు. ప్రేక్షకులు ప్లాట్‌ఫామ్‌ను బట్టి ఎమోజి అర్థాన్ని ఎలాగోలా చెక్కారు. నిర్దిష్ట ఎమోజీకి అర్థాన్ని ఆపాదించాలనే నిర్ణయం తీసుకుంటారు. ఇది ఏదో ఒకవిధంగా షేర్స్‌తో పాపులర్ అవుతుంది. ప్రజలు దాన్ని నిర్దిష్ట మార్గంలో ఉపయోగించడానికి అంగీకరిస్తారు. ఇది పూర్తిగా వయస్సు మీద ఆధారపడి ఉంటుందని నేను నమ్మను' అని బ్రోని అభిప్రాయపడ్డారు.
ఎమోజి వివరణలో కల్చరల్ సెట్టింగ్స్ రోల్?
కొన్ని ఎమోజీలు విభిన్న సాంస్కృతిక సెటప్స్‌లో నిర్దిష్ట వైవిధ్యాలను ప్రేరేపిస్తాయి. కొన్ని సందర్భానుసారంగా తరచూ ఉపయోగించబడతాయి. Prismoji.com చేసిన అధ్యయనం ప్రకారం.. ఇంగ్లీష్, టర్కిష్, జర్మన్, స్పానిష్ ట్వీట్స్ రెడ్ కలర్ హార్ట్ టాప్ ఎమోజీగా ఉపయోగించబడింది. అరబిక్, ఉర్దూ, ఫార్సీ ట్వీట్స్‌లో చంద్రవంక అత్యంత సాధారణ ఎమోజీ అని తేలింది. అలాగే ఇంగ్లీష్, ఫ్రెంచ్ వంటి పాశ్చాత్య భాషల్లో ప్రార్థించే చేతులు ఎక్కువగా కనిపిస్తాయని అధ్యయనం పేర్కొంది. ఇది వివిధ కల్చరల్ సెటప్స్‌లో విభిన్న అర్థాలకు వేర్వేరు చిహ్నాల అనుబంధాన్ని చూపుతుంది. ఇది ఎమోజి వివరణ, వినియోగాన్ని ఎలా ప్రభావితం చేస్తుందో చూపిస్తుంది.