Health Tips : తిండి మానేయకుండానే బరువు తగ్గొచ్చని తెలుసా..? ఏం చేయాలంటే..
Health Tips : తిండి మానేయకుండానే బరువు తగ్గొచ్చని తెలుసా..? ఏం చేయాలంటే..
దిశ, ఫీచర్స్ : ఈరోజుల్లో అత్యధిక మందిని వేధిస్తున్న సమస్యల్లో అధిక బరువు ఒకటి. నిర్లక్ష్యం చేస్తే మధుమేహం, గుండె జబ్బులు వంటి ఇతర అనారోగ్యాలకు కూడా దారి తీస్తుంది. కాబట్టి చాలా మంది వెయిట్ లాస్ కోసం రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు. కొందరైతే బరుతవు తగ్గాలనే ఉద్దేశంతో అన్నం తినడం పూర్తిగా మానేస్తుంటారు. ఇలా చేయడం కూడా ఆరోగ్యానికి నష్టమే. తగిన పోషకాలతో కూడిన లిమిటెడ్ డైట్ తీసుకోవాలి తప్ప తిండి మానేయడం సరైన పరిష్కారం కాదంటున్నారు ఆరోగ్య నిపుణులు. అందుకోసం ఏం చేయాలో ఇప్పుడు చూద్దాం.
తక్కువ కేలరీలు ఉండేలా..
అన్నంలో కేలరీలు, కార్బోహైడ్రేట్లు కాస్త ఎక్కువ. కాబట్టి దీనివల్ల బరువు పెరుగుతారనేది కొంత వరకు వాస్తవమే అయినా.. పూర్తిగా మానేయడం కూడా కరెక్ట్ కాదంటున్నారు నిపుణులు. దీనివల్ల ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం పడుతుంది. కాబట్టి అన్నం తింటూనే ఈజీగా బరువు తగ్గవచ్చు అంటున్నారు నిపుణులు. కాకపోతే పరిమితంగా తినాలి. సాధారణంగా వండిన కప్పు అన్నంలో సుమారు 240 కేలరీలు ఉంటాయి. అధిక బరువు సమస్యను ఫేస్ చేస్తుంటే గనుక మీ భోజనంలో అరకప్పు మాత్రమే తినొచ్చు. దీనివల్ల బరువును పెంచే కేలరీలు సగానికి తగ్గుతాయి. అలాగే ఫైబర్ సహా ఇతర పోషకాలు కూడా మీరు తీసుకునే భోజనంలో ఉండేలా చూసుకోవాలి.
ప్రొటీన్స్ కూడా ముఖ్యమే
అన్నం మితంగా తీసుకన్నా.. భోజనంలో ప్రొటీన్ తగిన స్థాయిలో ఉంటే అధిక బరువు సమస్య రాకుండా ఉంటుందని పోషకాహార నిపుణులు అంటున్నారు. ఎందుకంటే ఇది ఉండటంవల్ల కొంచెం తినగానే కడుపు నిండిన ఫీలింగ్ కలుగుతుంది. తద్వారా తక్కవ కేలరీలు తీసుకుంటారు. సో.. పప్పులు, బీన్స్, గుడ్లు, కాయ ధాన్యాలు, లీన్ మీట్, కూరగాయలు వంటివి ఆహారంలో భాగంగా తప్పక తీసుకోండి. కూరగాయల్లోని విటమిన్లు, మనిరల్స్ ఓవరాల్ హెల్త్‌కి మంచిది. అలాగే నూనె, వెన్న వంటివి ఎక్కువగా వేసిన వేపుడు ఆహారాలు కేలరీలను పెంచుతాయి. కాబట్టి వాటిని తగ్గించాలి. ఇక వైట్‌రైస్‌కు ప్రత్యామ్నాయం ఎంచుకోవాలనుకుంటే.. ప్రస్తుతం బ్లాక్ రైస్, బ్రౌన్ రైస్ వంటివి కూడా మార్కెట్లో అందుబాటులో ఉంటున్నాయి. తక్కువ కేలరీలు కలిగి ఉంటున్నందున ఇవి కూడా అధిక బరువును తగ్గడంలో మీకు సహాయపడతాయి.
* గమనిక : పైవార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. మీ అవగాహన కోసం మాత్రమే అందిస్తున్నాం. అనుమానాలు ఉంటే నిపుణులను సంప్రదించగలరు.