Children's Health : పిల్లల్లో బ్యాక్టీరియల్ ఇన్‌ఫెక్షన్స్.. పేరెంట్స్ నిర్లక్ష్యం చేయకూడని విషయాలివే..

Children's Health : పిల్లల్లో బ్యాక్టీరియల్ ఇన్‌ఫెక్షన్స్.. పేరెంట్స్ నిర్లక్ష్యం చేయకూడని విషయాలివే..

Update: 2024-11-24 08:02 GMT

దిశ, ఫీచర్స్ : మిగతా సీజన్లతో పోలిస్తే చలికాలంలో సీజనల్ వ్యాధులకు అవకాశం ఎక్కువ. ముఖ్యంగా చిన్న పిల్లలు బ్యాక్టీరియల్ ఇన్‌‌క్షన్లకు (For bacterial infections) గురవుతుంటారు. జలుబు, దగ్గు, జ్వరం గొంతు నొప్పి వంటి సమస్యలను ఎదుర్కొంటారు. కాబట్టి ఈ సీజన్‌లో పేరెంట్స్ ముఖ్యంగా మూడు విషయాల్లో చాలా కేర్ తీసుకోవాలని సూచిస్తున్నారు. అవేమిటో చూద్దాం.

వాటర్ సరిపడా తాగేలా చూడాలి

కూల్ వెదర్ కారణంగా వింటర్‌లో దాహం ఎక్కువగా వేయదు. దీంతో 12 ఏండ్లలోపు పిల్లలు నీరు చాలా తక్కువగా తాగుతుంటారు. పెద్దలు గమనించకపోతే కొన్నిసార్లు రోజు మొత్తంలో ఆహారం తిన్నప్పుడు తప్ప మిగతా సమయంలో నీళ్లు అస్సలు తాగరు. దీంతో బాడీలో నీటిశాతం వాటర్ కంటెంట్ తగ్గి డీహైడ్రేషన్‌(Dehydration)కు గురయ్యే చాన్స్ ఉంటుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అంతేకాకుండా తక్కువ వాటర్ తాగడంవల్ల శ్వాసకోశ ఇబ్బందులు తలెత్తుతాయి. శరీరంలోని వ్యర్థాలు యూరిన్ ద్వారా బయటకు వెళ్లడం తగ్గుతుంది. బ్యాక్టీరియల్, వైరల్ ఇన్ ఫెక్షన్లవంటివి పెరిగే చాన్స్ ఎక్కువగా ఉంటుంది. సో.. పిల్లలకు సరిపడా నీళ్లు తాగించాలి. చల్లార్చిన నీళ్లు తాగించడం మంచిది.

వెచ్చని దుస్తులే మేలు

వాతావరణంలో దుమ్ము, ధూళి, పొగమంచు వంటివి వింటర్‌లో అధికంగా ఉంటాయి. ఇలాంటప్పుడు చిన్నారులు ఉదయం, సాయంత్రం వేళల్లో చలిగాలులకు గురైతే బ్యాక్టీరియల్ ఇన్‌ఫెక్ష(Bacterial infections)న్లు సోకుతాయి. కాబట్టి తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే పిల్లలు వెచ్చటి దుస్తులు ధరించేలా చూడాలి. ఇక రెండు మూడేళ్ల లోపు పిల్లలకైతే వెచ్చగా ఉండేలా ఉన్ని దుస్తులు, మంకీ క్యాప్, చేతులకు గ్లవ్స్, కాళ్లకు సాక్స్ వంటివి తొడిగించడం బెటర్ అంటున్నారు నిపుణులు.

కాసేపు ఎండలో ఉండేలా..

ఐదేండ్ల నుంచి పన్నెండేండ్లలోపు పిల్లలకు చలికాలంలో చిన్న చిన్న వ్యాయామాలు లేదా ఫిజికల్ యాక్టివిటీస్ (Physical activities) తప్పక ఉండేలా చూడాలంటున్నారు నిపుణులు. రన్నింగ్, సైక్లింగ్, జాగింగ్, స్కిప్పింగ్ వంటివి ఆరోగ్యానికి మేలు చేస్తాయి. శరీరాన్ని ఫిట్‌గా ఉంచడంతోపాటు వ్యాధి నిరోధక శక్తిని పెంచడంలో సహాయపడతాయి. దీంతోపాటు పిల్లలకు విటమిన్ డి లభించాలంటే.. ప్రతి రోజూ ఉదయంపూట కాసేపు ఎండలో ఆడుకునేలా చూడండి. శారీరక, మానసిక ఆరోగ్యానికి మేలు జరుగుతుంది.

ఈ ఆహారాలు తప్పక ఇవ్వాలి

పిల్లలు చలికాలంలో ఆహారం, నీరు తక్కువగా తీసుకుంటారు. దీనివల్ల ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం పడుతుంది. రోగ నిరోధక శక్తి పడిపోతుందని నిపుణులు చెబుతున్నారు. కాబట్టి విటమిన్లు, మినరల్స్, యాంటీ ఆక్సిడెంట్లు (antioxidants) పుష్కలంగా ఉండే ఆహారాలు తినిపించాలి. తాజా కూరగాయలు, ఆకు కూరలు, ముఖ్యంగా బొప్పాయి, నారింజ, టొమాట, పాలకూకర, కాలీ ఫ్లవర్, అల్లం వంటివి ఆహారంలో భాగంగా తప్పక ఉండేలా చూడాలి. ఫ్రైడ్, ప్రాసెస్డ్, ఫాస్ట్ ఫుడ్స్, జంక్ ఫుడ్స్‌కి వీలైనంత దూరంగా ఉండేలా చూడాలంటున్నారు నిపుణులు.

* గమనిక : పైవార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. మీ అవగాహన కోసం మాత్రమే అందిస్తున్నాం. అనుమానాలు ఉంటే నిపుణులను సంప్రదించగలరు. 

Tags:    

Similar News