wedding ceremony:డిసెంబర్‌లో మోగనున్న పెళ్లి బాజాలు.. ఈ తేదీల్లో శుభ ముహూర్తాలు

వివాహ వేడుక ప్రతి ఒక్కరి జీవితంలో ఓ మధురానుభూతి. అందుకే అందరూ మెచ్చుకునేలా, పదికాలాలు గుర్తుండి పోయేలా వైభవంగా జరుపుకోవాలని భావిస్తారు.

Update: 2024-11-24 08:57 GMT

దిశ,వెబ్‌డెస్క్: వివాహ వేడుక ప్రతి ఒక్కరి జీవితంలో ఓ మధురానుభూతి. అందుకే అందరూ మెచ్చుకునేలా, పదికాలాలు గుర్తుండి పోయేలా వైభవంగా జరుపుకోవాలని భావిస్తారు. అందుకు తగ్గట్లే ఏర్పాట్లు చేసుకుంటారు. బంధువులందరి సమక్షంలో ఆనందంగా పెళ్లి కార్యక్రమం జరుపుకుంటారు. దీంతో ఫంక్షన్ హాళ్లు, పురోహితులకు, మంగళ వాయిద్యాలు, ఫుడ్ క్యాటరింగ్, డెకరేషన్‌, ఫొటోగ్రాఫర్లకు, షామియానా , పూలదండలు, తదితర వ్యాపారులకు ఈ కొన్ని రోజులు చేతి నిండా పని దొరకనుంది. నవంబర్‌లో పెళ్లి సందడి నెలకొంది. మళ్లీ ముహూర్తాల సందడి మొదలైంది.

ఈ క్రమంలో వచ్చే నెల డిసెంబర్‌లో కూడా పెళ్లిళ్లకు శుభ ముహూర్తాలు ఉన్నాయని పురోహితులు తెలిపారు. దీంతో పల్లె, పట్టణం అన్న తేడా లేకుండా పెళ్లి బజాలు మోగనున్నాయి. పెళ్లిళ్లు, గృహప్రవేశాలు తదితర శుభకార్యాలతో ఊరువాడ కళకళలాడనున్నాయి. డిసెంబర్(మార్గశిర)లో పెళ్లి బాజాలు మోగనున్నాయి. ఈ నెలలో బలమైన ముహూర్తాలు ఉన్నాయని పురోహితులు, సిద్ధాంతులు చెబుతున్నారు. డిసెంబర్ 4, 5, 6, 7, 10, 11, 14, 20, 22, 24, 25 తేదీల్లో శుభ ముహూర్తాలు ఉన్నాయని తెలిపారు. దీంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీ సంఖ్యలో వివాహాలు జరుగుతాయి. ఇక జనవరిలో మంచి ముహూర్తాలు లేవు. జనవరి 31 నుంచి మార్చి 4 వరకు మాఘమాసంలో శుభకార్యాలకు ముహూర్తాలు ఉన్నాయి.


Similar News