Raw onion: భోజనంతో పాటు పచ్చి ఉల్లి తింటే ఏమవుతుందో తెలుసా..?
భారతీయ వంటకాల్లో కనిపించే వాటిల్లో ఉల్లిపాయ ముఖ్యమైనది. దీనిని దాదాపుగా అన్నీ కూరల్లో ఎక్కువగా వాడుతుంటారు.
దిశ, ఫీచర్స్: భారతీయ వంటకాల్లో కనిపించే వాటిల్లో ఉల్లిపాయ ముఖ్యమైనది. దీనిని దాదాపుగా అన్నీ కూరల్లో ఎక్కువగా వాడుతుంటారు. ఇవి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. చాలాామంది ప్రతి రోజూ తీసుకునే ఆహారంలో ఉల్లిపాయలను ఒక భాగం చేసుకుని తింటుంటారు. అయితే, పచ్చి ఉల్లిపాయలను ఆహారంలో భాగంగా చేసుకొని తినడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. చాలామంది కూరల్లో వేసినా సరే, పచ్చి ఉల్లిని భోజనంతోపాటు తింటుంటారు. బిర్యానీలు, పెరుగు అన్నం, చికెన్ కర్రీలు వంటి ఎన్నో రకాల ఆహారాలతో పాటు తింటారు. ఇలా తినడం వల్ల పచ్చి ఉల్లి ఆ ఫుడ్ టేస్ట్‌ను మార్చుతుంది. పచ్చి ఉల్లి తింటే ఏమవుతుందో ఇప్పుడు తెలుసుకోండి.
శరీరాన్ని ఉల్లి అనేక అనారోగ్య సమస్యల నుంచి కాపాడుతుంది. ప్రతి రోజూ ఉల్లిపాయను తినడం వల్ల జీర్ణ సమస్యలు తగ్గుతాయి. ఎందుకంటే ఇందులో యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు వ్యాధులకు వ్యతిరేకంగా పోరాడడంలో సహాయపడతాయి. పచ్చి ఉల్లిపాయల్ని ఆహారంలో భాగంగా తినడం వల్ల ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇది శరీరంలో పేరుకుపోయిన చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో బాగా ఉపయోగపడుతుంది. ఇందులో క్వెర్సెటిన్ అనే యాంటీఆక్సిడెంట్ శరీరంలోని చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది.
ఇమ్యూనిటీ తక్కువగా ఉన్నవారికి పచ్చి ఉల్లిపాయలు మేలు చేస్తాయి. ఇందులో విటమిన్ సి, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి ఎన్నో రకాల రోగాల నుండి శరీరాన్ని కాపాడుతాయి. బరువు తగ్గాలనుకునే వారికి కూడా పచ్చి ఉల్లి సహాయపడుతుంది. ఇందులో ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉండి, కేలరీలు తక్కువగా ఉంటాయి. పచ్చి ఉల్లిని ఆహారంతో తినడం వల్ల ఎక్కువసేపు కడుపు నిండుగా ఉంటుంది. దీని వల్ల ఆహారంను ఎక్కువగా తినలేరు. చర్మ సమస్యలు ఉన్న వారికి ఇది బాగా ఉపయోగపడుతుంది. పచ్చి ఉల్లిపాయను ఆహారంలో భాగంగా ప్రతి రోజూ తింటే చర్మ సమస్యలను తగ్గించుకోవచ్చు. ఎందుకంటే ఇందులో సల్ఫర్ సమ్మేళనం ముఖంపై ఉన్న మొటిమలను తగ్గించి, స్కిన్ సాఫ్ట్‌గా ఉంచుతుంది.
ఈ రోజుల్లో చాలామందికి గుండె జబ్బులు వస్తున్నాయి. గుండె ఆరోగ్యానికి పచ్చి ఉల్లి ఉపయోగపడుతుంది. పచ్చి ఉల్లిలో ప్లేవనాయిడ్లు, థియోసల్పినేట్లు అనే సమ్మేళనాలు ఎక్కువగా ఉంటాయి. ఇవి గుండె ఆరోగ్యానికి మేలు చేస్తాయి. ఇందులో ఉండే ప్రోబయోటిక్స్ జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతుంది. అయితే, ఉల్లిపాయను తింటే ప్రయోజనాలు ఉన్నాయని అదే పనిగా ప్రతీసారి ఎక్కువగా తినడం ఆరోగ్యానికి మంచిది కాదు. దీనిని నిత్యం కొద్ది మోతాదులోనే తీసుకోవడం మంచిది. అతిగా పచ్చి ఉల్లిపాయను తింటే కొన్ని రకాల అలెర్జీలు వచ్చే అవకాశం ఉంది.
*గమనిక: పైవార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. ‘దిశ’ ధృవీకరించలేదు. అనుమానాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించగలరు.