చుండ్రు సమస్య వేధిస్తోందా..? స్నానానికి ముందు ఇలా చేయండి !
ఈ రోజుల్లో చాలామందికి జుట్టు బలహీనంగా మారడం, చుండ్రు, తెల్లటి జుట్టు వంటి సమస్యలను ఎదుర్కొంటున్నారు
దిశ, ఫీచర్స్: ఈ రోజుల్లో చాలామందికి జుట్టు బలహీనంగా మారడం, చుండ్రు, తెల్ల జుట్టు వంటి సమస్యలను ఎక్కువగా ఎదుర్కొంటున్నారు. ఈ సమస్యలను తగ్గించుకోవడం కోసం విశ్వ ప్రయత్నాలు చేస్తుంటారు. డాండ్రఫ్ సమస్య ఉన్న వాళ్లకు తరచుగా తల చిరాకుగా, దురదగా అనిపిస్తుంది. దీనిని అశ్రద్ధ చేశారంటే హెయిర్‌ఫాల్ ఎక్కువ అవుతుంది. కొందరు జుట్టుకు అస్సలు నూనె పెట్టరు. ఇలా నూనె రాయకపోవం వల్ల జుట్టు చిట్లిపోవడం, పెళుసుగా మారడం వంటివి జరుగుతుంటాయి. అయితే, తలకు నూనె రాయడం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. ప్రతీ రోజు కాకపోయిన తలస్నానానికి ముందు నూనె రాస్తే మంచి ఫలితం ఉంటుంది.
తలస్నానం చేయాలనుకున్నప్పుడు ఒక గంట ముందు నూనెను లైట్‌గా వేడి చేసి, తలకు మర్ధనా చేయడం వల్ల చుండ్రు సమస్యలను తగ్గిస్తుంది. అంతేకాకుండా ఇది కుదుళ్లను మృదువుగా ఉంచి, జుట్టు పెరుగుదలకు ఉపయోగపడుతుంది. తరచుగా తలకు ఆయిల్ రాయడం వల్ల జుట్టు మృదువుగా, ఒత్తుగా పెరుగుతుంది. నూనె రాసుకొని మర్ధనా చేయడం వల్ల ఒత్తడి తగ్గుతుంది.
జుట్టు పోషణకు కొబ్బరి నూనె సహాయపడుతుంది. ఇది జుట్టును మృదువుగా మారుస్తుంది. కొందరు, ఆముదం ఆలివ్ ఆయిల్‌ను ఉపయోగిస్తారు. వీటిలో విటమిన్ ఇ, కొవ్వు ఆమ్లాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి జుట్టును హైడ్రేట్‌గా ఉండేలా చేస్తుంది. తెల్లటి జుట్టును నివారించడానికి నల్ల నువ్వుల నూనె ఉపయోగపడుతుంది. తలస్నానం చేయాలనుకున్నప్పుడు రాత్రిపూట నూనె రాసినా లేదా స్నానికి కనీసం ఒక గంట ముందు నూనె రాసి, తలస్నానం చేసినా మంచి ఫలితం ఉంటుంది. తేలికపాటిగా మర్ధన చేస్తూ రాయడం వల్ల రక్తప్రసరణను మెరుగుపరుస్తుంది. కానీ, అధికంగా నూనె రాసుకోవడం మంచిది కాదు. ఇది జుట్టును జిడ్డుగా మార్చుతుంది. ఎప్పుడైనా సరే జుట్టుకు తగిన నూనెను ఎంచుకోవడం మంచిది.
*గమనిక: పైవార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. ‘దిశ’ ధృవీకరించలేదు. అనుమానాలు ఉంటే నిపుణులను సంప్రదించగలరు.