ఇంట్లోనే ఈజీగా చీజ్ ఆనియన్ రింగ్స్‌ని ఇలా చేసేయండి
చీజ్ ఆనియన్ రింగ్స్‌ని చాలామందికి ఇష్టపడుతుంటారు. ఇవి చాలా క్రంచీగా, క్రిస్పీగా ఉంటాయి.
దిశ, ఫీచర్స్: చీజ్ ఆనియన్ రింగ్స్‌ని చాలామందికి ఇష్టపడుతుంటారు. ఇవి చాలా క్రంచీగా, క్రిస్పీగా ఉంటాయి. చీజ్ సాఫ్ట్‌నెస్, ఆనియన్ క్రంచి కలయిలక తింటుంటే చాలా అద్భుతంగా ఉంటుంది. వీటిని ఇంట్లోనే ఈజీగా స్నాక్స్‌లా తయారు చేసుకోవచ్చు. వీటిని ఎలా తయారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.
కావల్సిన పదార్ధాలు:
చీజ్ స్లైసులు - 4
ఆనియన్స్ - 1 కప్పు
మైదా - అరకప్పు
బ్రెడ్ పొడి - చిన్న కప్పు
చిల్లి ఫ్లెక్స్ - 1 స్పూన్
కొత్తి మీర - 1 స్పూన్
కోడి గుడ్లు - 3
నూనె - ఫ్రై కి సరిపడినంత
ఉప్పు - రుచికి సరిపడా
తయారీ విధానం:
ముందుగా ఉల్లిపాయలను మందంగా రింగ్స్‌లా కట్ చేయాలి. తరువాత చీజ్ స్లైసులను తీసుకుని నిలువుగా సన్నగా కట్ చేయాలి. వీటిని ఆనియన్ రింగ్స్ చూట్టూ రౌండ్‌గా వచ్చేలా పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నెలో మైదా, సన్నగా తరిగిన కొత్తిమీర, చిల్లీ ఫ్లెక్స్, ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి. అందులో కొంచెం నీరు పోసి, మందంగా దోస పిండిలా కలుపుకోవాలి. తరువాత బ్రెడ్ పొడిని ఒక ప్లేట్లో పెట్టుకోవాలి. గుడ్లను ఒక బౌల్‌లో పగలగొట్టాలి. స్టవ్ మీద కళాయి పెట్టి, డీప్ ఫ్రైకి సరిపడా నూనెను వేయాలి. తదుపరి చీజ్ ఆనియన్ రింగ్‌ను తీసుకుని మైదాపిండి మిశ్రమంలో ముంచి తీయాలి. బ్రెడ్ పొడిపై పెట్టి దానికి అంటుకునే చేయాలి. వెంటనే గుడ్లు మిశ్రమంలో కలిపి, బ్రెడ్ పొడిపైని వాటిపై చల్లాలి. నూనె వేడెక్కిన తరువాత వీటిని అందులో వేసి వేయించుకోవాలి. గోల్డ్ రంగు వచ్చే వరకు వేయించి పక్కన పెట్టుకోవాలి. అంతే టేస్టీగా ఉండే చీజ్ ఆనియన్ రింగ్స్ రెడీ.