Summer Tips: నెల రోజులు ఎండాకాలం జీలకర్ర వాటర్ తాగితే శరీరంలో జరిగే మార్పులివే..?
జీలకర్ర(cumin)లో అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఇ

దిశ, వెబ్‌డెస్క్: జీలకర్ర(cumin)లో అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఇది జీర్ణక్రియ(digestion)ను మెరుగుపర్చడంలో ఎంతో మేలు చేస్తుంది. అజీర్ణం (indigestion), గ్యాస్, ఉబ్బరం వంటి సమస్యలను తగ్గిస్తుంది. అంతేకాకుండా.. జీలకర్ర జీవక్రియను పెంచి, బరువును నియంత్రించడంలో సహాయపడుతుంది. రక్తపోటును తగ్గించడంలో తోడ్పడుతుంది. జీలకర్రలో యాంటీఆక్సిడెంట్లు (Antioxidants) పుష్కలంగా ఉంటాయి. తద్వారా రోగనిరోధక శక్తిని పెంచుతుంది. అలాగే మధుమేహానికి చెక్ పెట్టడంలో జీలకర్ర ఎంతో మేలు చేస్తుంది.
అంతేకాకుండా.. జీలకర్ర చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. మొటిమలు, గజ్జి, సోరియాసిస్ వంటి చర్మ వ్యాధుల్ని తగ్గిస్తుంది. జీలకర్ర జుట్టు రాలడాన్ని, బట్టతలని నివారిస్తుంది. జీలకర్ర కడుపునొప్పి, విరేచనాలు, మలబద్ధకం (Constipation), ఒత్తిడి, తలనొప్పి వంటి సమస్యల్ని కూడా తగ్గించడంలో సహాయపడుతుంది. అయితే జీలకర్ర వాటర్‌ను సమ్మర్‌ను నెల రోజుల పాటు తాగితే శరీరంలో జరిగే మార్పులేంటో తాజాగా నిపుణులు వెల్లడించారు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం...
రెగ్యులర్‌గా వంటల్లో ఉపయోగించే జీలకర్రలో పోషకాలు దట్టంగా ఉంటాయి. కాగా ఇది వంట రుచిని పెంచడంలో కీలక పాత్ర పోషిస్తుంది. ఇక ఎండాకాలంలో నెల రోజుల పాటు జీలకర్ర వాటర్ తాగితే శరీరంలో చెడు కొలెస్ట్రాల్ (bad cholesterol) తగ్గిపోతుంది. కాగా మార్నింగ్ వేళ ఖాళీ కడుపుతో జీలకర్రను వేడి వాటర్‌లో మరిగించిన నీరు తీసుకుంటే మేలని నిపుణులు చెబుతున్నారు.
డైటీషియన్ల ప్రకారం అయితే.. వెయిట్ లాస్ అవ్వాలనుకునే వారికి జీలకర్రవాటర్ బెస్ట్ ఆప్షన్ అని చెప్పుకోవచ్చు. అలాగే జీలకర్రను ఒక గ్లాసులో నూట్ అంతా నానబెట్టి తాగితే కూడా హెల్త్‌కు ఎంతో మంచిది. శరీరం నుంచి టాక్సిన్స్ తొలగించడానికి కూడా తోడ్పడుతుంది. ఇది జీవక్రియను మెరుపర్చడమే కాకుండా.. గుండె సంబంధిత వ్యాధుల్ని (Cardiac diseases) దరిచేరనివ్వవు.
అలాగే జీలకర్ర వాటర్ నెల రోజుల పాటు తాగితే.. మానసిక ఆరోగ్యానికి (mental health) ఎంతో మేలు జరుగుతుంది. జ్జాపకశక్తి కూడా పెరుగుతుంది. ముఖ్యంగా రోజంతా యాక్టివ్‌గా ఉంటారు. కేవలం హెల్త్ బెనిఫిట్స్ మాత్రమే కాకుండా.. ఈ కషాయం అందాన్ని పెంచుతుంది. ఆరోగ్యకరమైన చర్మాన్ని ప్రోత్సహిస్తుంది. జీరలోని కాల్షియం, పొటాషియం (Potassium), రాగి, సెలీనియం, మాంగనీస్ (Manganese) స్కిన్‌కు మేలు చేస్తుంది. జీలకర్ర వాటర్‌లోని యాంటీ ఇన్ఫ్లమేటరీ,యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు తల స్కిన్ అలాగే హెయిర్ సిల్కీగా అయ్యేందుకు తోడ్పడుతుందని నిపుణులు వెల్లడిస్తున్నారు.
గమనిక: పైవార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. దిశ దీనిని ధృవీకరించలేదు. మీ అవగాహన కోసం నిపుణులు అందించిన సమాచారం మాత్రమే అందిస్తున్నాం. పై వార్తలో మీకు అనుమానాలు ఉంటే కనుక నిపుణులకు సంప్రదించగలరు.