ఎగ్జిమా స్కిన్ డిసీస్‌తో విసుగు చెందుతున్నారా.. ఈ విధంగా స్నానం చేశారంటే సమస్య దూరం!

ఎగ్జిమా వ్యాధిని అటోపిక్ డెర్మటైటిస్ అని కూడా పిలుస్తారు.

Update: 2025-03-22 16:18 GMT
ఎగ్జిమా స్కిన్ డిసీస్‌తో విసుగు చెందుతున్నారా.. ఈ విధంగా స్నానం చేశారంటే సమస్య దూరం!
  • whatsapp icon

దిశ, వెబ్‌డెస్క్: ఎగ్జిమా వ్యాధిని అటోపిక్ డెర్మటైటిస్ అని కూడా పిలుస్తారు. చర్మం పొడిబారి, దురద, దద్దుర్లతో కూడిన ఒక దీర్ఘకాలిక, తాపజనక చర్మ వ్యాధి. ఇది సాధారణంగా బాల్య దశలో ప్రారంభవుతుందని నిపుణులు చెబుతున్నారు. తర్వాత కొన్నిసార్లు ఏ వయస్సులోనైనా ఈ సమస్యతో బాధపడొచ్చని అంటున్నారు. ఎగ్జిమా లక్షణాలు చూసినట్లైతే.. చర్మం చాలా పొడిగా, గరుకుగా ఉంటుంది.

చర్మం దురదగా, చికాకుగా అనిపిస్తుంది. వీటితో పాటుగా.. చర్మం ఎర్రబడుతుంది. వాపు కూడా రావచ్చు. చర్మంపై చిన్న చిన్న దద్దుర్లు లేదా మచ్చలు వచ్చే ప్రమాదం ఉంది. పగుళ్లు, గాయాలు ఏర్పడవచ్చు. ముఖ్యంగా పిల్లల్లో మోచేతులు, మోకాళ్లు, మెడ, తల చర్మం, ముఖంపై ఎక్కువగా కనిపిస్తుందని నిపుణులు చెబుతున్నారు. పెద్ద వారిలో అయితే.. చేతులు, కాళ్లు, మెడ, ముఖంపై కనిపిస్తుంటుంది.

కాగా చర్మాన్ని తేమగా ఉంచడానికి మాయిశ్చరైజింగ్ లోషన్లు, క్రీమ్స్ ఉపయోగించడం మేలని నిపుణులు సూచిస్తున్నారు. చర్మాన్ని గీకకుండా ఉండాలి. చల్లని నీటితో స్నానం చేయాలి. దురదను తగ్గించే మందులు వాడాలి. కానీ వైద్యుల్ని సంప్రదించిన తర్వాతే మందులు వాడాలి. చర్మంపై చికాకు కలిగించే పదార్థాలను (ఉదా: కొన్ని రకాల వస్త్రాలు, సబ్బులు) నివారించాలి.

అలాగే ఎగ్జిమాను దూరం చేసుకోవాలంటే ఈ విధంగా స్నానం చేయాలని నిపుణులు సూచిస్తున్నారు. షవర్ బాత్ స్నానం స్కిన్ చర్మ వ్యాధి లక్షణాల్ని తగ్గిస్తుందని ఫ్రాంటియర్స్ ఇన్ ఇమ్మునాలజీలో ప్రచురించబడింది. షవర్ బాత్ లో ఒక మైక్రోమీటర్ కంటే చిన్న సైజ్ లో చిన్న బుడగలు ఏర్పడ్డాయని పరిశోధకులు వెల్లడించారు.

కాగా ఇవి వాటర్‌ను శుద్ధీకరించేందుకు వాడుతారు. తద్వారా ఎగ్జిమా బాధితులకు ఉపశమనం కలుగుతుంది. స్నానం చేసే టైంలో అతి సూక్ష్మ బుడగలు చర్మ ఉపరితలంలోకి తోతుగా చొచ్చుకుపోతాయట. చికాకు, అలెర్జీని కలిగించే క్రిములు తొలగిపోతాయని నిపుణులు సూచిస్తున్నారు.

గమనిక: పైవార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. దిశ దీనిని ధృవీకరించలేదు. మీ అవగాహన కోసం నిపుణులు అందించిన సమాచారం మాత్రమే అందిస్తున్నాం. పై వార్తలో మీకు అనుమానాలు ఉంటే కనుక నిపుణులకు సంప్రదించగలరు.

మెగాస్టార్ బ్యాక్ టు హోమ్.. ఎయిర్‌పోర్ట్ వద్ద అదిరిపోయే స్టిల్

డెలివరీ తర్వాత పీరియడ్స్ సరిగా రాకపోవడం సాధారణమేనా? ఎలాంటి సమయంలో వైద్యుల్ని కలవాలి?

Tags:    

Similar News