Saweety Boora: దీపక్ నివాస్ హుడాను కొట్టిన భార్య స్వీటీ బూరా! వేధింపుల కేసు వివాదం
గత కొన్ని నెలలుగా భారత్‌లో విడాకుల కేసులు ఎక్కువైతున్నాయి. ఇక క్రీడాకారులు, సెలబ్రిటీల విడాకుల కేసులు నెట్టింట చర్చానీయాంశంగా మారుతున్నాయి.

దిశ, డైనమిక్ బ్యూరో: గత కొన్ని నెలలుగా భారత్‌లో విడాకుల కేసులు ఎక్కువైతున్నాయి. ఇక క్రీడాకారులు, సెలబ్రిటీల విడాకుల కేసులు నెట్టింట చర్చానీయాంశంగా మారుతున్నాయి. ఈ క్రమంలోనే భారత భారత కబడ్డీ టీమ్ మాజీ కెప్టెన్ దీపక్ నివాస్ హుడా (Deepak Hooda), అతని భార్య భారత దిగ్గజ బాక్సర్ స్వీటీ బూరా (Saweety Boora) మధ్య కొంతకాలంగా మనస్పర్థలు చోటుచేసుకున్నాయి. దీపక్ తనను అదనపు కట్నం కోసం వేధిస్తున్నాడంటూ స్వీటీబూరా గతంలో హర్యానాలో పోలీసులకు కంప్లైంట్ చేశారు. అతని కుటుంబసభ్యులపై కూడా ఆమె ఆరోపణలు చేశారు. ఈ క్రమంలో తాజాగా పెద్దల సమక్షంలో చర్చలు జరుగుతుండగా అసహనానికి గురైన స్వీటీబూరా దీపక్ గల్లా పట్టుకుని దాడికి ప్రయత్నించిన వీడియో నెట్టింట వైరల్ అవుతుంది.
వీడియోలో ఉన్న ప్రకారం.. (Hisar police station) హిసార్ పోలీస్ స్టేషన్‌లో ఇరువురి కుంటుంబ సభ్యుల మధ్య చర్చలు జరుగుతున్నాయి. ఇద్దరి మధ్య కొంత సంభాషణ జరుగుతుండగా.. స్వీటీ బోరా ఒక్కసారిగా భర్త దీపక్ నివాస్ కాలర్ పట్టుకోని కొట్టే ప్రయత్నం చేసింది. వెంటనే కుటుంబ సభ్యులు ఆమెను శాంతిపజేశారు. కాగా, ప్రపంచ ఛాంపియన్ బాక్సర్ స్వీటీ బురా, మాజీ కబడ్డీ కెప్టెన్ దీపక్ హుడా 2022లో వివాహం చేసుకున్నారు. గత కొంత కాలంగా ఇద్దరి మధ్య వివాదం చెలరేగుతోంది. దీపక్ హుడాపై అనేక స్వీటీ తీవ్రమైన ఆరోపణలు చేశారు. తన భర్త కట్నం కోసం వేధించేవాడని ఆరోపిస్తున్నారు. తన భర్త చిత్రహింసలు పెట్టడం వల్లే తాను రెండు సార్లు ఆత్మహత్యకు ప్రయత్నించానని ఆమె తెలిపారు. తనకు ఏదైనా జరిగితే తన మరణానికి దీపక్ హుడా, హిసార్ ఎస్పీలే బాధ్యత వహిస్తారని ఇటీవల మీడియాతో స్వీటీ మాట్లాడారు. దీంతో పోలీసు అధికారులు దీపక్‌ను కలిసి విచారణ చేపట్టారు.