DA Hike: ఉద్యోగులకు సర్కార్ భారీ శుభవార్త

ఉద్యోగులకు ప్రభుత్వం(Central Govt) భారీ శుభవార్త చెప్పింది. డీఏ(DA)ను రెండు శాతం పెంచింది.

Update: 2025-03-28 09:55 GMT
DA Hike: ఉద్యోగులకు సర్కార్ భారీ శుభవార్త
  • whatsapp icon

దిశ, వెబ్‌డెస్క్: ఉద్యోగులకు ప్రభుత్వం(Central Govt) భారీ శుభవార్త చెప్పింది. డీఏ(DA)ను రెండు శాతం పెంచింది. ఈ మేరకు కేంద్ర కేబినెట్‌(Union Cabinet)లో నిర్ణయం తీసుకున్నది. డీఏ పెంచడం ద్వారా మొత్తం 1.15 కోట్ల మంది ఉద్యోగులకు లబ్ధి చేకూరనుంది. వీరిలో 50 లక్షల మంది ఉద్యోగులు కాగా, 65 లక్షల మంది రిటైర్డ్ ఉద్యోగులకు (Retired Employees) ప్రయోజనం చేకూరనుంది. ఈ పెంపు తర్వాత డీఏ ప్రాథమిక వేతనంలో 53 శాతం నుంచి 55 శాతానికి పెరుగనుంది.

దీనికి ముందు 2024 అక్టోబర్‌లో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల(Govt Employees)కు 3 శాతం డీఏ పెంపు లభించింది. ఇది జూలై 1, 2024 నుంచి అమల్లోకి వచ్చింది. ఈ పెంపు తర్వాత డీఏ ప్రాథమిక వేతనంలో 50 శాతం నుండి 53 శాతానికి పెరిగింది. తాజాగా మరోసారి డీఏ పెంచుతూ కేంద్ర కేబినెట్‌ నిర్ణయం తీసుకోవడంతో అది 53 నుంచి 55 శాతానికి పెరగనుంది. పెన్షనర్లకు కూడా ఇదే స్థాయిలో డీఏ పెంపును అందించనున్నారు. ఉగాది పండుగ సమీపిస్తోన్న వేళ డీఏ పెంచడంతో ఉద్యోగులంతా హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Tags:    

Similar News