వెనుకబడిన కులాల ఆకాంక్ష నెరవేర్చేలా..
ఆయన అణగారిన వర్గాల జీవితాలలో వెలుగులు నింపుతున్న నాయకుడు.. సామా జిక న్యాయ సాధన కోసం నిరంతరం తపిస్తున్న

ఆయన అణగారిన వర్గాల జీవితాలలో వెలుగులు నింపుతున్న నాయకుడు.. సామా జిక న్యాయ సాధన కోసం నిరంతరం తపి స్తున్న అట్టడుగు దళిత వర్గాల ఆత్మ బందువు.. ఎస్సీ వర్గీకరణ కార్యసాధనలో కీలక పాత్రదా రిగా నిలిచిన నాయకుడు వైద్యారోగ్య శాఖ మంత్రి సిలారపు దామోదర రాజనర్సింహ. ఈయన అణగారిన వర్గాల ఆశాదీపం. ఈ మధ్య జరిగిన ఓ సభలో ఆయన.. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ చెప్పిన మాటలను ప్రస్తావి స్తూ "సాంఘిక ప్రజాస్వామ్యం లేనంత కాలం రాజకీయ ప్రజాస్వా మ్యం లేనట్టేనని, సాంఘిక ఆర్థిక ప్రజాస్వామ్యం లేని రాజకీయ ప్రజాస్వామ్యం రక్త మాంసాలు లేని ఒట్టి ఆస్తిపంజరమేనని, రాజకీయాల్లో ఆర్థిక సాంఘిక జీవితాల్లో అసమానతలు తొలగించకపోతే ఆ అసమానత్వంతో బాధపడుతున్న ప్రజలు ఈ రాజకీయ ప్రజాస్వామ్య వ్యవస్థను పేల్చివేస్తారు" అని పేర్కొన్నారు.
30 ఏళ్లుగా పోరాడుతున్న ఎస్సీ వర్గీకరణ అనే ఒక దళిత జాతి ఆకాంక్షను నెరవేర్చడం కోసం అతడే ఒక సైన్యంగా నిరంతరం అనేకమంది న్యాయనిపుణులు, మేధావులు, దళిత ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు వివిధ సంఘాల నాయకులతో చర్చించి దళితుల్లో అన్ని సామాజిక వర్గాలకు సమన్యాయం, సామాజిక న్యాయం చేకూర్చే విధంగా ముఖ్యంగా అత్యంత వెనుకబడ్డ మాదిగ, అనుబంద కులాల ఆకాంక్షను నెరవేర్చేలా అన్ని తానై ప్రభుత్వంలో మంత్రిగా ఉండి అలుపెరుగని పోరాటం చేసి ఎస్సీ వర్గీకరణ కార్యసాధనలో కీలక భూమిక పోషించారు దామోదర రాజనర్సింహ.
వర్గీకరణపై మార్గదర్శక కృషి
2024 ఆగస్టు ఒకటిన దేశ అత్యున్నత న్యాయస్థానం ఎస్సీలలో వివిధ కులాల మధ్య అంతరాలను తొలగించుటకు ఎస్సీ వర్గీకరణే పరిష్కారమని దీన్ని ఆయా రాష్ట్ర ప్రభుత్వాలే అమలు చేసుకోవచ్చని పంజాబ్ వర్సెస్ దావీందర్ సింగ్ కేసులో సంచలనాత్మక తీర్పునిచ్చింది. ఈ కేసు సుప్రీంకోర్టు బెంచ్‌కి వచ్చినప్పటి నుంచి నేటి వరకు ప్రతి దశలోనూ మంత్రి దామోదర రాజనర్సింహ కీలక పాత్ర వహిస్తూ సమస్య త్వరితగతిన పరిష్కారం చేయడానికి వారు చేసిన కృషి మార్గదర్శకమైంది. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంపూర్ణ సహకారంతో సీనియర్ సుప్రీంకోర్టు న్యాయవాదులను నియ మించి తానే స్వయంగా ఢిల్లీకి వెళ్లి సుప్రీంకోర్టులో రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా వాదనలు వినిపించి కోర్టు తీర్పు త్వరగా రావడంలో కీలకంగా వ్యవహరించారు. తీర్పు వెలువడిన గంటలోనే తెలంగాణ రాష్ట్ర శాసన సభలో ముఖ్యమంత్రితో దేశంలోనే మన రాష్ట్రం మొదటగా ఎస్సీ వర్గీకరణ అమలు చేస్తామని, అంతవరకు కొత్త ఉద్యోగ నోటిఫికేషన్లు అన్నీ కూడా నిలిపిస్తామని ప్రకటించడంలో కీలక పాత్ర వహించారు.
అమరుల పాదాలు కడిగిన నేత..
ప్రభుత్వం మంత్రివర్గ ఉప సంఘాన్ని ఉత్తమ్‌కుమార్ రెడ్డి నేతృత్వంలో నియమించగా అందులో సభ్యులుగా ఉన్న దామోదర రాజనర్సింహ కీలక పాత్ర నిర్వహించి ఎక్కడా న్యాయపరంగా అవరోధాలు ఎదురు కావద్దనే ఉద్దేశంతో రిటైర్డ్ హైకోర్టు జడ్జి జస్టిస్ షమీం అక్తర్‌తో ఏకసభ్య కమిషన్ ఏర్పాటు చేసింది. ఈ కమిషన్ 82 రోజుల్లో అన్ని జిల్లాలు పర్యటించి, అన్ని కోణాలలో వివరాలు సేకరించి, సుప్రీంకోర్టు తీర్పుకు లోబడి, త్వరితగతిన ప్రభుత్వానికి 199 పేజీల నివేదికను ఇవ్వడం జరిగింది. ఈ నివేదికపై అసెంబ్లీలో చర్చించి ఫిబ్రవరి 4ని "సోషల్ జస్టిస్ డే"గా అధికారికంగా ప్రభుత్వం ప్రకటించింది. అదే రోజు ఎస్సీ వర్గీకరణ పోరాటంలో అమరులైన కుటుంబాలందరిని ఒకే వేదికపైకి పిలిచి ఒక్కొక్క కుటుంబానికి 5 లక్షల రూపాయల ఆర్థిక సహాయం అందించి, వారిని గౌరవిస్తూ కొత్త బట్టలు పెట్టి ఒక మంత్రి హోదాలో వారి పాదాలు కడిగి ఆ నీళ్లు నెత్తిన జల్లుకుని, అమరులకు జోహార్లు అర్పించడం యావత్ జాతిని చలింపజేసింది.
ఆరు నెలల అవిరళ కృషితో సాకారం..
మార్చి 17న అసెంబ్లీలో ఎస్సీ వర్గీకరణ బిల్లును స్వయంగా మంత్రి దామోదర రాజనర్సింహ ప్రవేశ పెడుతూ ఎస్సీ వర్గీ కరణ ఆవశ్యకత, దళితుల స్థితిగతులు, మోస్ట్ బ్యాక్వర్డ్ షెడ్యూల్డ్ కులాలకు అందాల్సిన విద్యా ఉద్యోగ ఉపాధి రాజకీయ ప్రయోజనాలపై సభలో తనదైన శైలిలో అద్భుతంగా ఆవిష్కరించడం చరిత్రాత్మకం. సుదీర్ఘ సమస్యకు చాకచక్యంగా పరిష్కారం చూపడానికి కృషి చేశారు. ఈ బిల్లును సభ ఏకగ్రీవంగా ఆమోదించే ప్రక్రియ కేవలం ఆరు నెలల్లో పూర్తవ్వడంలో ఆయన కృషి ఎంతో విలువైంది. అణగారిన వర్గాల ఆకాంక్షలను నెరవేర్చే పరిష్కారం కోసం, రాత్రనక పగలనకా కష్టపడి పని చేయడం ఆయన నిబద్దత, జాతి పట్ల ఆత్మగౌరవానికి నిదర్శనం.
ఆత్మగౌరవ పరిరక్షణే లక్ష్యం
మాదిగ సామాజిక వర్గంలో జన్మించిన దామోదర రాజ నర్సింహ ఆర్థికంగా, రాజకీయంగా ఒక ఉన్నత కుటుంబంలో పుట్టినప్పటికీ కొన్ని సందర్భాల్లో తను ఎదుర్కొన్న కుల వివక్షతకు చింతిస్తూ తన జాతి భవిష్యత్తులో ఆత్మగౌరవంతో తలెత్తుకొని జీవించాలనీ, ఆత్మాభిమానంతో సగౌరవంగా ఈ సమాజంలో భాగం కావాలనీ పరితపిస్తుంటారు. ఎస్సీ వర్గీకరణ చట్టం చేసిన తదనంతరం దళితుల్లో అట్టడుగు వర్గాల్లో అసమానతలు తొలగించడానికి అత్యంత వెనుకబడిన దళిత ప్రజల అభివృద్ధి కోసం ప్రతి ఒక్కరం కృషి చేయాలని, ముఖ్యంగా విద్యావ్యాప్తి, విప్లవాత్మక భూసంస్కరణలు, ఎస్సీ సబ్ ప్లాన్ మొదలైన అవకాశాలను దళిత సంఘాల నాయకులు, ప్రజాప్రతినిధులు, దళిత సమాజంలోకి తీసు కెళ్లాలని షెడ్యూల్ కులాలందరూ సంఘటితమై రాజ్యాధికారాన్ని సాధించాలని తద్వారా తమ విముక్తిని తామే సాధించాలన్నారు. ఒక్కమాటలో చెప్పాలంటే దామోదర రాజనర్సింహ దళిత జాతి అభ్యున్నతి కోసం, పేద ప్రజల అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తున్న ఈ తరం నాయకుడని నిస్సందేహంగా చెప్పొచ్చు.
(ఎస్సీ వర్గీకరణపై ప్రభుత్వం అసెంబ్లీలో చట్టం చేసిన సందర్బంగా మంత్రి దామోదర రాజనర్సింహపై ప్రత్యేక వ్యాసం)
- బైరి వెంకటేశం
ఎస్సీ కులాల హక్కుల పోరాట సమితి
94919 94090