Viral video: బయట ఫ్రూట్ జ్యూసులు తాగుతున్నారా? అయితే ఈ వీడియో చూడండి!

ప్రస్తుతం కల్తీ రాజ్యమేలుతుంది.

Update: 2025-03-28 10:25 GMT
Viral video: బయట ఫ్రూట్ జ్యూసులు తాగుతున్నారా? అయితే ఈ వీడియో చూడండి!
  • whatsapp icon

దిశ, వెబ్ డెస్క్: ప్రస్తుతం కల్తీ రాజ్యమేలుతుంది. మార్కెట్లో ఏది కొనాలన్నా.. తినాలన్నా.. భయపడే పరిస్థితులు నెలకొన్నాయి. పాలు, పండ్లు, కూరగాయలు ప్రతిదీ కల్తీ చేసేస్తున్నారు. అంతేకాదు, రోడ్డు పక్కన చిన్న చిన్న బండ్ల దగ్గర నుంచి పెద్ద పెద్ద రెస్టారెంట్లు సైతం ఇష్టారాజ్యంగా నిబంధనలకు విరుద్ధంగా నాణ్యత ప్రమాణాలు పాటించకుండా ఆహారాన్ని విక్రయిస్తున్నాయి. ఫలితంగా డబ్బులు వృథాకావడంతోపాటు అనారోగ్యం బోనస్​గా వస్తుంది. తాజాగా ఇందుకు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

ఢిల్లీలోని (Delhi) అయూబ్ ఖాన్ అనే వ్యక్తి పండ్ల జ్యూసులను (Juice) విక్రయిస్తున్నాడు. అయితే, దానిమ్మ (Pomegranate) జ్యూసులో హానికరమైన కెమికల్స్ కలిపి కస్టమర్లకు విక్రయిస్తున్నాడు. ఇది గమనించిన కస్టమర్లు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు వచ్చి అతడిని ప్రశ్నించగా.. తన బాస్ షోయబ్ తనను ఇలాగే విక్రయించమని చెప్పినట్లుగా సమాధానం ఇచ్చారు. ఈ సంఘటనను వీడియో తీసి నెట్టింట షేర్ చేయగా వైరల్‌గా మారింది. ఇది చూసిన నెటిజన్లు షాక్ అవుతున్నారు. ఇలాంటి వాళ్లను జైలులో పెట్టాలని, ఇప్పటి నుంచి జ్యూస్ తాగాలంటే కూడా భయమేస్తుందంటూ కామెంట్లు పెడుతున్నారు.

కాగా, ఫుడ్ సేఫ్టీ అండ్ క్వాలిటీ యాక్ట్, 2006 ప్రకారం ఎవరైనా కల్తీ ఆహార పదార్థాలను ఉత్పత్తి చేయడం, విక్రయించడం, పంపిణీ చేయడం వంటివి చేస్తూ పట్టుబడితే తీవ్రమైన నేరంగా పరిగణించబడుతుంది. నేరారోపణపై జరిమానా, శిక్ష.. ఒక్కోసారి రెండూ విధించవచ్చు. కల్తీ ఆహార పదార్థాలను తయారు చేసి విక్రయిస్తే రూ.లక్ష వరకు జరిమానా విధించవచ్చు. నేరం తీవ్రతను పరిగణనలోకి తీసుకుంటే.. 6 నెలల నుంచి 7 సంవత్సరాల వరకు శిక్ష విధిస్తారు. కల్తీ ఆహారం తిన్న వ్యక్తి మరణిస్తే, కల్తీ చేసిన వ్యక్తికి జీవిత ఖైదు లేదా 10 సంవత్సరాల వరకు జైలు శిక్ష విధించవచ్చు.


Click Here For Video!

Tags:    

Similar News