బీహార్, యూపీ వాళ్ళు పాపులేషన్ పెంచి ఇండియాను కాపాడుతున్నారు -చంద్రబాబు
పీ సీఎం చంద్రబాబు నాయుడు ( Chandrababu ) మరోసారి హాట్ కామెంట్స్ చేశారు. సౌత్ ఇండియాలో ఫెర్టిలిటీ ప్రాబ్లమ్స్ ఎక్కువగా

దిశ, వెబ్ డెస్క్: ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ( Chandrababu ) మరోసారి హాట్ కామెంట్స్ చేశారు. సౌత్ ఇండియాలో ఫెర్టిలిటీ ప్రాబ్లమ్స్ ఎక్కువగా ఉన్నాయని... దానివల్ల ఎక్కువ మంది పిల్లలను కనలేక పోతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. కానీ నార్త్ ఇండియాలో (North India) బీహార్ ( Bihar ) అలాగే యూపీ ( UP) లాంటి వాళ్లు పాపులేషన్ పెంచి ఇండియాను కాపాడుతున్నారని... చంద్రబాబు నాయుడు వెల్లడించారు.
ఇవాళ చెన్నైలో చంద్రబాబు నాయుడు పర్యటించారు. ఈ సందర్భంగా నిర్వహించిన ఐఐటీ మద్రాస్ ఆల్ ఇండియా రీసెర్చ్ స్కాలర్స్ సమ్మిట్ 2025 ( IT Madras All India Research Scholars Summit 2025) ఈవెంట్ లో చంద్రబాబు నాయుడు పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా జనాభా పెంపుదలపై చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. ఇండియాకు సౌత్ ఇండియా మార్గదర్శనం చేసే పరిస్థితి ఉందని వెల్లడించారు. మనం ప్రస్తుతం పాపులేషన్ మేనేజ్మెంట్ పైన ఆలోచించాలని కోరారు.
లేకపోతే నార్త్ ఇండియా పాపులేషన్ పెరిగితే అక్కడి నుంచి ఇక్కడికి మైగ్రేషన్ పెరిగే ప్రమాదం ఉంటుందని హెచ్చరించారు. చదువుకునే మీరంతా పిల్లలు లేకుండా లైఫ్ ఎంజాయ్ చేయాలనుకుంటున్నారని వెల్లడించారు సీఎం చంద్రబాబు నాయుడు. ఆ ఆలోచన విరమించుకొని జనాభా పెంపుదలపై దృష్టి పెడితే బాగుంటుందన్నారు. అప్పుడే మనం ప్రపంచాన్ని శాసిస్తామని తెలిపారు. దీంతో చంద్రబాబు చేసిన కామెంట్స్ హాట్ టాపిక్ అయ్యాయి. గతంలో కూడా పాపులేషన్ పెంచాలని చంద్రబాబు నాయుడు... పేర్కొన్న సంగతి తెలిసిందే. ఎక్కడ సౌత్ ఇండియా మీటింగ్ లో జరిగిన ఇవే వ్యాఖ్యలు చేస్తున్నారు సీఎం చంద్రబాబు.
సౌత్ ఇండియాలో ఫెర్టిలిటీ ప్రాబ్లెమ్ వల్ల ఎక్కువ మంది పిల్లలను కనలేకపోతున్నారు
— Telugu Scribe (@TeluguScribe) March 28, 2025
నార్త్ ఇండియాలో బీహార్, యూపీ వాళ్ళు పాపులేషన్ పెంచి ఇండియాను కాపాడుతున్నారు - సీఎం చంద్రబాబు pic.twitter.com/8lCmvZcb7L