రష్యాకు హెచ్ఏఎల్ ఎలాంటి పరికరాలు అమ్మలేదు!

ఇండియా వ్యూహాత్మక వాణిజ్యంపై బలమైన చట్టాలు, నియంత్రణ కలిగి ఉంటుంది. భారత్ కంపెనీలు విదేశీ వాణిజ్యం చేసే సమయంలో అలాంటి కఠినమైన చట్టాలకు లోబడే ఉంటాయి.

Update: 2025-03-31 17:54 GMT
రష్యాకు హెచ్ఏఎల్ ఎలాంటి పరికరాలు అమ్మలేదు!
  • whatsapp icon

- భారత సంస్థ ద్వారా రష్యాకు పరికరాలు పంపారన్నది అవాస్తవం

- న్యూయార్క్ టైమ్స్ కథనం తప్పుదోవ పట్టించేలా ఉంది

- వార్తలు ప్రచురించే ముందు తగిన శ్రద్ధ తీసుకోవాలి

- విదేశీ వ్యవహారాల శాఖ హెచ్చరిక

దిశ, నేషనల్ బ్యూరో: రష్యన్ ఆయుధ సంస్థకు సున్నితమైన సాంకేతిక పరిజ్ఞానాన్ని భారత ప్రభుత్వానికి చెందిన హిందుస్తాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (హెచ్ఏఎల్) చేసిందని న్యూయార్క్ టైమ్స్ ఒక కథనంలో పేర్కొంది. కాగా, ఈ కథనం పూర్తిగా అవాస్తవమని, వార్తలను ప్రచురించే ముందు తగిన శ్రద్ధ తీసుకోవాలని విదేశీ వ్యవహారాల శాఖ సోమవారం ఒక ప్రకటనలో హెచ్చరించింది. హెచ్ఏఎల్ సంస్థ వ్యూహాత్మక వాణిజ్య నియంత్రణ, తుది వినియోగదారుల నిబద్దతలపై అన్ని రకాల అంతర్జాతీయ నియమాలకు కట్టుబడి ఉంటుందని అందులో పేర్కొంది. ఆ నివేదిక పూర్తిగా వాస్తవ విరుద్దమని, తప్పుదోవ పట్టించేదని తెలిపింది. ఇదొక రాజకీయ కథనమని, వాన్తవాలను వక్రీకరించడానికి ప్రయత్నించారని ఎంఈఏ వర్గాలు తెలిపాయి.

ఇండియా వ్యూహాత్మక వాణిజ్యంపై బలమైన చట్టాలు, నియంత్రణ కలిగి ఉంటుంది. భారత్ కంపెనీలు విదేశీ వాణిజ్యం చేసే సమయంలో అలాంటి కఠినమైన చట్టాలకు లోబడే ఉంటాయి. కాబట్టి ఇలాంటి కథనాలను ప్రఖ్యాత మీడియా సంస్థలు ప్రచురించే సమయంలో ప్రాథమిక జాగ్రత్తలు తీసుకుంటాయని తాము ఆశిస్తున్నట్లు విదేశీ వ్యవహారాల శాఖ తెలిపింది. ఈ అంశంలో న్యూయార్క్ టైమ్స్ తమ నిబద్దతను పూర్తిగా విస్మరించిందని పేర్కొంది. బ్రిటిష్ ఏరోస్పేస్ తయారీదారు హెచ్ఆర్ స్మిత్ గ్రూప్‌లో భాగమైన ఒక కంపెనీ 2023 నుంచి 2024 వరకు ఒక భారతీయ సంస్థకు కొన్ని పరికరాలు సరఫరా చేసింది. అయితే ఆ పరికరాలు హెచ్ఏఎల్ ద్వారా రష్యన్ ఆయుధ సంస్థ రోసోబోరోన్ ఎక్స్‌పోర్ట్‌కు వెళ్లాయని న్యూయార్క్ టైమ్స్ తమ కథనంలో పేర్కొంది.

అయితే ఆ పరికరాలు రష్యాకు చేరుకున్నాయని నిరూపించే ఆధారాలు తమ వద్ద లేవని కూడా తెలిపింది. హెచ్ఆర్ గ్రూప్ నుంచి తీసుకున్న పరకరాల విడిభాగాలు రష్యాకు చేరుకున్నాయి. అందులో పరికరాల గుర్తింపు కోడ్‌లు సేమ్‌గా ఉన్నాయని తెలిపింది. అయితే ఆ ఉత్పత్తులు రష్యాకు చేరలేదని హెచ్ఏఎల్ హామీ ఇచ్చిందో లేదో కూడా బ్రిటిష్ తయారీదారు చెప్పలేదని కూడా ఆ కథనంలో పేర్కొన్నారు.

Tags:    

Similar News