viral video: వామ్మో.. నోట్ల వర్షం.. కాదు కాదు.. వరద.. తుపాను.. మీరు కూడా ఏరుకోండి!
viral video: ఆకాశం నుంచి డబ్బుల వర్షం కాదు తుఫాన్ లా వస్తే ఎలా ఉంటుంది.

దిశ, వెబ్‌డెస్క్: viral video: ఆకాశం నుంచి డబ్బుల వర్షం కాదు తుఫాన్ లా వస్తే ఎలా ఉంటుంది. మన పిచ్చికాకుంటే కలలో తప్ప నిజంగా ఎప్పుడైనా డబ్బుల వర్షం కురుస్తుందా. అయితే ఈ వీడియో చూస్తే నిజమే అనిపిస్తుంది. అనిపించడమేంటీ నిజంగానే డబ్బుల వర్షం కురిసింది.ఒకటి కాదు రెండు కాదు ఏకంగా రూ. 8.3 కోట్లు ఆకాశం పై నుంచి పడుతుంటే చూసిన జనాలు ఒక్కసారిగా షాక్ అయ్యారు. వెంటనే తేరుకుని వీలైనన్ని నోట్లు దక్కించుకునేందుకు ఎగబడ్డారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
పూర్తి వివరాల్లోకి వెళితే చెక్ రిపబ్లిక లోని లిసానాడ్ లాబెమ్ ప్రాంతంలో ఇటీవల జరిగిన ఈ ఘటన వైరల్ అయ్యింది. కామిల్ బార్తోషేక్ స్థానికంగా బాగా పాపులారిటీ ఉన్న వ్యక్తి. అక్కడి వారికి కాజ్మాగా సుపరిచితుడు. అతను సోషల్ మీడియా ఇన్ ఫ్ల్యూయెన్సర్ యే కాకుండా టీవీషో యాంకర్ కూడా. అతను నటించిన ఓ మూవీలో ఓ పజిల్ ను చూపించాడు. ఆ చిక్కుముడిని విప్పినవారికి మిలియన్ డాలర్ల డబ్బు బహుమతిగా ఇస్తానని చెప్పాడు. అయితే ఆ చిక్కుముడిని ఎవరూ విప్పలేకపోయారు. కానీ కాజ్మా మాత్రం తన మాటను నిలబెట్టుకోవాలనుకున్నాు. ఈ క్రమంలోనే మిలియన్ డాలర్ల కరెన్సీని ఆశాశం నుంచి వానాల కురిపిస్తే..ఎవరికి తోచినంత వారు తీసుకుంటారని భావించాడు. అనుకున్న వెంటనే ఓ హెలికాప్టర్ సాయంతో తాను అనుకున్న పని చేసి చూపించాడు.
ఇందుకోసం అతను ఓ పెద్ద కంటెయినర్ లో డబ్బు పెట్టుకుని దాన్ని హెలికాప్టర్ సాయంతో ఆకాశంలోకి తీసుకెళ్లాడు. ఆ తర్వాత కంటెయినర్ అడుగు భాగం తెరవడంతో కరెన్సీ నోట్లన్నీ కిందున్న జనాల మీద పడ్డాయి. దీంతో జనాలు వీలైనన్ని నోట్లను చేజిక్కించుకునేందుకు ఎగబడ్డారు. ఆ వీడియో ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ అవుతోంది. అయితే దీనికి కారణమైన ఇద్దరిని పోలీసులు అరెస్టు చేశారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు జనాలను అదుపు చేసే ప్రయత్నం చేశారు. ఆ డబ్బు అంతా తిరిగి ఇచ్చేయాలని వార్నింగ్ ఇచ్చారు.
Read More..
యూట్యూబ్ చిట్కాలతో ఎవరెస్టు అధిరోహించిన 59 ఏళ్ల మహిళ