Nitish Kumar : జాతీయ గీతాన్ని అవమానించిన సీఎం
తెలిసి చేసినా, తెలియక చేసినా జాతీయ జెండాను, జాతీయ గీతాన్ని ఎవరూ అవమానించినా శిక్షార్హులే.

దిశ, వెబ్ డెస్క్ : తెలిసి చేసినా, తెలియక చేసినా జాతీయ జెండాను, జాతీయ గీతాన్ని ఎవరూ అవమానించినా శిక్షార్హులే. కాగా ప్రస్తుతం ఇలాంటి వివాదంలో ఏకంగా ముఖ్యమంత్రి చిక్కుకోవడం సంచలనం రేపుతోంది. బీహార్ సీఎం నితీశ్ కుమార్(Bihar CM Nitish Kumar) జాతీయ గీతాన్ని అవమానించిన(Disrespecting National Anthem) వీడియో నెట్టింట్లో వైరల్ అవుతోంది. గురువారం పాట్నాలో జరిగిన ఓ స్పోర్ట్స్ ఈవెంట్ లో బీహార్ సీఎం నితీశ్ కుమార్ పాల్గొన్నారు. అయితే సభలో జాతీయ గీతం వస్తున్నప్పుడు అంతా లేచి సైలెంట్ గా నిలబడగా,, నితీశ్ కుమార్ మాత్రం నవ్వులు చిందిస్తూ.. పక్కనే ఉన్న చీఫ్ సెక్రెటరీతో మాట్లాడటానికి ప్రయత్నించారు. ఒ దశలో చీఫ్ సెక్రెటరీ ఆయనని వారించే ప్రయత్నం చేసినప్పటికీ నితీశ్ అలాగే చేస్తూ ఉన్నారు. అంతేకాదు సభలో ఉన్నవారికి నమస్కారం పెట్టి వారితో కూడా మాట్లాడేందుకు ప్రయత్నించారు. కాగా ఈ వ్యవహారంపై విపక్షాలు భగ్గుమన్నాయి.
సాక్షాత్తు ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి జాతీయ గీతాన్ని అవమానించినందుకు ఒక బీహారిగా సిగ్గుపడుతున్నాను అని విపక్ష నేత తేజస్వి యాదవ్(Tejaswi Yadav) అన్నారు. సీఎం హోదాలో ఉండి ఇలా చేయడం ఏమిటని ప్రశ్నించారు. ఆయనకు మానసిక స్థితి సరిగా లేదని, తక్షణమే నితీశ్ సీఎం పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. మరోవైపు మాజీ ముఖ్యమంత్రి, ఆర్జేడి నేత రబ్రీదేవి(Rabridevi).. నితీశ్ కుమార్ చర్యపై మండిపడ్డారు. ఆయనకు మానసిక వైకల్యం ఉంటే, ఆయన కొడుకును సీఎంగా చేయాలని, అంతేగాని జాతీయ గీతాన్ని ఇలా అవమానిస్తారా అంటూ నిలదీశారు. నితీశ్ కుమార్ మానసిక ఆరోగ్యం గురించి ఆ పార్టీ ఎంపీ మిశా భారతి అనుమానాలు వవ్యక్తం చేశారు. ఆయన రోజూ మహిళలను, పిల్లలను అవమానిస్తున్నారని అన్నారు.