జస్టిస్ యశ్వంత్ వర్మపై నివేదికను బహిర్గతపరిచిన సుప్రీంకోర్టు

కాగా, ఈ నివేదికలో గోప్యతను కాపాడటానికి పేర్లతో పాటు కొన్ని పత్రాలను తొలగించారు.

Update: 2025-03-22 19:44 GMT
జస్టిస్ యశ్వంత్ వర్మపై నివేదికను బహిర్గతపరిచిన సుప్రీంకోర్టు
  • whatsapp icon

- పారదర్శకత కోసమే

దిశ, నేషనల్ బ్యూరో: ఢిల్లీ హైకోర్టులో న్యాయమూర్తిగా పని చేస్తున్న జస్టిస్ యశ్వంత్ వర్మ ఇంట్లో నగదు దొరికినట్లు వచ్చిన ఆరోపణల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ ఆరోపణలపై విచారణ చేపట్టిన ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీకే ఉపాధ్యాయ సమర్పించిన నివేదికను సుప్రీంకోర్టు వెబ్‌సైట్‌లో అప్‌డేట్ చేశారు. ఈ కేసులో పారదర్శకత కోసమే అత్యున్నత న్యాయ స్థానం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. నగదు దొరికిన ఆరోపణలపై డీకే ఉపాధ్యాయ నివేదికతో పాటు జస్టిస్ వర్మ స్పందనకు సంబంధించిన పత్రాలను కూడా అప్‌లోడ్ చేశారు. భారత న్యాయ వ్యవస్థలో కళంకం లేని వారసత్వాన్ని కాపాడాల ఉద్దేశంతో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నా..కొలీజియం సభ్యులు జస్టిస్ బిఆర్ గవాయ్, జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ ఏఎస్ ఓకా, జస్టిస్ విక్రమ్ నాథ్‌లను సంప్రదించి ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్లు తెలిసింది. ఈ నివేదికను బహిర్గతపరచడం ద్వారా తప్పుడు సమాచారం వ్యాప్తి చెందకుండా ఉంటుందనే ఉద్దేశంతోనే సుప్రీంకోర్టు వెబ్‌సైట్‌లో ఈ పత్రాలను అప్‌లోడ్ చేసినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. కాగా, ఈ నివేదికలో గోప్యతను కాపాడటానికి పేర్లతో పాటు కొన్ని పత్రాలను తొలగించారు.


Similar News