Mahindra: సందేశంపై దృష్టి పెట్టాను.. ఉద్దేశం కాదు.. నెటిజన్‌కు ఆనంద్ మహీంద్రా రిప్లై
ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్రా (Anand Mahindra) తన ఎక్స్(ట్విట్టర్)లో పోస్ట్ చేసిన వైరల్‌గా మారింది.

దిశ, డైనమిక్ బ్యూరో: ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్రా (Anand Mahindra) తన ఎక్స్(ట్విట్టర్)లో పోస్ట్ చేసిన వైరల్‌గా మారింది. అందులో రోడ్డుపై ఖరీదైన లగ్జరీ పోర్షే కారు వద్ద సెల్ఫీలు తీసుకుంటున్న ఓ సమాన్య వ్యక్తిని కారు యజమాని రైడ్‌కు తీసుకెళ్లి తన ఔదర్యం చాటుకుంటాడు. దీంతో సాధారణ వ్యక్తి ఎంతో సంతోషపడుతాడు. ఈ క్లిప్ చూసి మనుసు చలించిపోయిన ఆనంద్ మహీంద్రా వీడియో షేర్ చేశారు. ‘ఈ వీడియో పాతది కావొచ్చు.. నేను ఈ వీడియోను ఇటీవలే చూశాను, నన్ను ఈ వీడియో కదిలించింది. ముందుగా ఆ కారు యజమాని సానుభూతికి ధన్యవాదాలు. నేను ఒకటి చెప్పాలి, కార్ల తయారీదారుగా, కార్లు ప్రజలకు అందించగల నిరాడంబరమైన ఆనందాన్ని గుర్తుచేసుకుంటున్నాను. కార్లు కేవలం రవాణా పరికరాల కంటే ఎక్కువ అని మహీంద్రాలో మా డిజైనర్లు, ఇంజనీర్లు గుర్తుంచుకుంటారు. అభిరుచితో రూపొందించినప్పుడు, వాటిని అనుభవించే వారందరికీ వారు ఆనందాన్ని అందించగలరు.’ అని రాసుకొచ్చారు.
వీడియో వైరల్ కావడంతో నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు. ఈ వీడియో కంటెంట్ క్రియేటర్ శీను మలిక్‌దని అది స్క్రిప్టు ప్రకారం చేసిన వీడియో ఓ నెటిజన్‌లు ఆయనకు అని కామెంట్ పెట్టాడు. ఈ సందర్భంగా ఓ నెటిజన్‌కు మహీంద్రా రిప్లై ఇస్తూ..‘భహుశా అయ్యుండొచ్చు.. నేను ఉద్దేశ్యంపై కాదు, సందేశంపై దృష్టి పెడుతున్నాను. సోషల్ మీడియాలో తగినంత కంటెంట్ ఉందని మనందరికీ తెలుసు, అక్కడ ఉద్దేశ్యంపై కాదని, సందేశం చూడాలని మహీంద్రా రిప్లై ఇచ్చారు. మహీంద్రా రిప్లైకి చాలా మంది నెటిజన్లు మద్దతు తెలిపారు.