విడాకులు నేర్పిన విద్య.. ఈమె గురించి తెలిస్తే వావ్.. అనకతప్పదు

పెళ్లంటే రెండు తనువులేకాదు రెండు మనసుల కలయిక. నిండు నూరేళ్లు పిల్లాపాపలతో సంతోషమయ జీవితాన్ని ఆ జంట కలగంటుంది.

Update: 2025-03-18 11:12 GMT
విడాకులు నేర్పిన విద్య.. ఈమె గురించి తెలిస్తే వావ్.. అనకతప్పదు
  • whatsapp icon

దిశ, ఫీచర్స్ : పెళ్లంటే రెండు తనువులేకాదు రెండు మనసుల కలయిక. నిండు నూరేళ్లు పిల్లాపాపలతో సంతోషమయ జీవితాన్ని ఆ జంట కలగంటుంది. కానీ, కాలం, జీవితం అన్‌ప్రెడిక్టబుల్. ఎప్పుడు ఏమైనా జరగొచ్చు. కలలు కల్లలు కావొచ్చు. దాంపత్యం నరకప్రాయం కావొచ్చు. కొన్నిసార్లు దురదృష్టవశాత్తు వివాహ బంధమే తెగిపోవచ్చు. ఆశల సౌధం కూలితే జీవితం ముగిసిపోయినట్టు కాదు కదా! అంతకుముందటి ఆశలకు కొంత ధైర్యాన్ని కలుపుకుని మళ్లీ ఇంటిని నిర్మించుకోవచ్చు. జీవితాన్ని కొత్తగా, మరింత అనువైన విధంగా, స్వతంత్రతతో పునర్నిర్మించుకోవచ్చు. 37 ఏళ్ల వీనస్ వాంగ్ అదే పని చేసింది. వాస్తవానికి విడాకుల తర్వాతే ఆమెకు కళ్ల ముందే ప్రపంచం తలకిందులైంది. అయినా అడుగులు బలంగా వేసి ఇండిపెండెంట్ లైఫ్‌ను బిల్డ్ చేసుకుంది.

చైనా టు అమెరికా..

2013లో ఓ టెక్ కంపెనీలో ఆరెంకల జీతం.. చైనా నుంచి అమెరికాలో వాలిపోయింది వీనస్ వాంగ్. పెళ్లి చేసుకున్నాక బిడ్డను పెంచడానికి ఏడాదిపాటు ఉద్యోగానికి రాజీనామా చేసి ఇంటిపట్టునే ఉన్నది. కొవిడ్ రావడంతో మరో దారి లేక బిడ్డను చూసుకుంటూ ఇంటికే పరిమితమైంది. అప్పుడే భర్త ఆమెకు విడాకులు ఇచ్చాడు. ఉన్న సంపద పంచుకుంటే ఆమెకు దక్కింది కేవలం రూ. 8.7 లక్షలు. అమెరికాలో సర్వైవ్ కావడానికి, అదీ సింగిల్ మామ్‌గా జీవించడానికి ఈ అమౌంట్ ఎంతో కాలం సరిపోదు. వెనక్కి తిరిగి చూసుకుంటే అప్పటి వరకు ఆమె తన వ్యక్తిగత ఆర్థికస్థితిని ఏమాత్రం సరిగాచూసుకోలేదని అర్థమైంది. చేతికందిన డబ్బులతో తాను, బిడ్డ ఎక్కువ కాలం బతకలేమని తెలిసొచ్చింది. బిడ్డ భవిష్యత్తూ అగమ్యగోచరంగానే కనిపించింది. ఈ పరిస్థితులు ఆమెను తన పరిధిని దాటేలా నెట్టేసింది. ఆలోచనల్లో అనూహ్య మార్పులు తెచ్చింది. కొత్తగా లైఫ్ స్టార్ట్ చేయాలనే దృఢ సంకల్పానికి వచ్చింది. మళ్లీ ఉద్యోగం చేయాలని నిశ్చయించుకుంది.

గూగుల్ టు ఏఐ...

గూగుల్‌లో ఉద్యోగం సంపాదించుకుంది. సుమారు 21 లక్షల జీతం. లైఫ్ మళ్లీ ట్రాక్‌లో పడింది. జాబ్ చేస్తూనే ఏఐ పై ఫోకస్ పెట్టింది. ఆ నాలెడ్జ్‌తో గూగుల్‌కు రిజైన్ చేసి ఓ స్టార్టప్‌లో చేరింది. ఆమె జీతం మూడింతలు పెట్టుకుంది. యేటా రూ. 8.7 కోట్లు సంపాదనకు చేరుకుంది. కానీ, లైఫ్‌ను మినిమల్‌గానే పెట్టుకుంది. ఈ సంపాదన ఎల్లకాలం తనకు, తన బిడ్డ భవిష్యత్‌కూ ఉపయోగపడాలని కోరుకుంటుంది.

Tags:    

Similar News